యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుసగా క్రేజీ సినిమాలకు మ్యూజిక్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. సీనియర్, యంగ్ హీరోలకు సాలిడ్ సాంగ్స్, ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తూ దూసుకుపోతున్నాడు.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుసగా క్రేజీ సినిమాలకు మ్యూజిక్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. సీనియర్, యంగ్ హీరోలకు సాలిడ్ సాంగ్స్, ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ‘అల..వైకుంఠపురములో’ నుండి థమన్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. ఎవ్వరూ ఊహించని విధంగా చార్ట్ బస్టర్ సాంగ్స్, థియేటర్లలో స్పీకర్స్ పగిలిపోయే ఆర్ఆర్ ఇస్తూ.. తనలోని మ్యుజీషియన్స్‌ని డిఫరెంట్ వే లో ప్రేక్షకులకు, ఇండస్ట్రీ వర్గాల వారికి ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రస్తుతం థమన్ సంగీతమందిస్తున్న ప్రెస్టీజియస్ ఫిలింస్‌లో ‘బ్రో’ ఒకటి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండగా.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ‘బ్రో’ ఈనెల 28న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు టీం. అందులో భాగంగా ఈమధ్య ‘మై డియర్ మార్కండేయ’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. పవన్, తేజ్, ఊర్వశి రౌతేలా అదరగొట్టేసిన ఈ పాటకు మిశ్రమ స్పందన వస్తుంది. బాగుంది అనే వారితో పాటే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు చేస్తూనే ఉన్నారు. దీని గురించి తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు థమన్. తనకి మిక్స్డ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని.. ఇది తేజ్ పాట, పవన్ కళ్యాణ్ గారొచ్చి ‘మార్కండేయ’ అని పాడతారు అని చెప్పుకొచ్చారు థమన్.
ఆయన మాట్లాడుతూ.. ‘ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే నేనేం చేయను. ఆ సినిమాకు ఎంత కావాలో అంతే చేయాలి. సినిమా ఎంత అడుగుతుందో అంతే చేయాలి. కడుపు ఎంత పడుతుందో అంతే అన్నం పెట్టాలి. అలాగే ‘బ్రో’ సాంగ్ కొంతమందికి నచ్చింది.. కొంతమందికి నచ్చలేదు.. కొంతమంది తిడుతున్నారు.. ఎప్పటిదో పాట అంటున్నారు’ అన్నారు. అలాగే తన మీద కాపీ, నెగిటివ్ ఆరోపణలనేవి ఎప్పుడూ చేసేవారే చేస్తున్నారు కానీ కొత్తగా పుట్టి ఎవరూ చెయ్యట్లేదు.. వాడి పని వాడు చేస్తున్నాడు, చేసుకోనివ్వండి అంటూ క్లారిటీగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు థమన్.