ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి గట్టి షాక్ తగిలింది! గతంలో ఆయనే చెప్పిన ఓ విషయం ఇప్పుడే ఏకంగా ఆయనకే రివర్స్ లో కోలుకోలేని దెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. సినిమాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ దిల్ రాజుకి జరిగిన దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే సంక్రాంతికి తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఆయన గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్న ‘వారసుడు’ కూడా రిలీజ్ కానుంది. ఇప్పుడు దాని వల్లే దిల్ రాజుకు పెద్ద షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2023 సంక్రాంతికి ఏయే సినిమాలు రిలీజ్ అవుతాయనేది ఇప్పటికీ ఖరారైపోయింది. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో పాటు తమిళ హీరో ‘వారసుడు’ కూడా విడుదల కానుంది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ కూడా రిలీజ్ అవ్వాలి. కానీ జూన్ కి వాయిదా వేశారు. అఖిల్ ‘ఏజెంట్’ని కూడా పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కనబెడితే దిల్ రాజు తెలుగులో పెద్ద నిర్మాత. నైజాం డిస్ట్రిబ్యూటర్. కాబట్టి చిరు-బాలయ్య సినిమాల కంటే ‘వారసుడు’ ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యే ఛాన్సుంది. ఈక్రమంలోనే తెలుగు నిర్మాతల మండలి విడుదల చేసిన నోట్ చర్చనీయాంశంగా మారింది.
‘తెలుగు చలన చిత్రాల పెరిగిన నిర్మాణ వ్యయం దృష్టిలో పెట్టుకుని నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందా అనే లక్ష్యంతో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి 08-12-2017న జరిగిన అత్యవసర మీటింగ్ లో సంక్రాంతి-దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ప్రముఖ నిర్మాత, ఛాంబర్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ దిల్ రాజు.. 2019లో మీడియా ద్వారా ‘స్ట్రెయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం’ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ప్రకారమే స్ట్రెయిట్ సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలియజేశాం. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపరచాలని తెలుగు సినిమాలు ఎక్కువ థియేటర్స్ కేటాయించి, మిగిలిన థియేటర్స్ డబ్బింగ్ సినిమాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ ని కోరుతున్నాం’ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
అయితే 2019 సంక్రాంతికి దిల్ రాజు ‘ఎఫ్ 2’ రిలీజ్ చేయగా, అది అప్పుడు హిట్ కొట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెటా’ విషయంలో డబ్బింగ్ సినిమా అని చెప్పి థియేటర్స్ పెద్దగా ఇవ్వలేదు. ఇప్పుడు అదే దిల్ రాజు.. తమిళ హీరో విజయ్ తో ‘వరిసు'(తెలుగులో ‘వారసుడు’) సినిమా తీస్తున్నారు. దిల్ రాజు గతంలో చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకుంటే.. తొలుత చిరు, బాలయ్య సినిమాలకు ఎక్కువగా థియేటర్లు కేటాయించాలి. ఆ తర్వాత ‘వారసుడు’ చిత్రానికి థియేటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలుగులో ఈ సినిమా కలెక్షన్స్ పై పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో?
Telugu Film Producers Council asks to Release only Straight Telugu films for Sankranthi & Dusshera as passed in previous resolutions and as remarked by Dil Raju himself in 2019! pic.twitter.com/deerk9cT6Q
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) November 13, 2022
In 2019 during #Pongal.. #DilRaju stated that dubbing movies like #Rajinikanth‘s #Petta should not get number of screens, preference should be given to Original Telugu films.
Now, as #DilRaju is trying to get more screens for his film #Varisu dubbing version, issues raised. pic.twitter.com/qBtgF43zns
— OverSeasRights.Com (@Overseasrights) November 13, 2022
THE BOSS RETURNS in style!#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman #Varisu#VarisuPongal pic.twitter.com/DQj0nqhoxH
— Sri Venkateswara Creations (@SVC_official) October 27, 2022
Megastar #Chiranjeevi #walterveeraya Sankranti 2023 Release! pic.twitter.com/r8g7FUf2bM
— Cinema Cafe (@cinemacafe_in) October 24, 2022
12/01/2023 🔥🔥🔥#VeeraSimhaReddy pic.twitter.com/4E8N68LJ4n
— Ravi.AKP (@RaviAKP) November 13, 2022