మహా శివరాత్రి పండుగ సమయం వచ్చేసింది. సామాన్యులు, సెలబ్రిటీలతో పాటు అందరూ రాత్రంతా శివారాధనతో పాటుగా ఆ పరమశివుడికి సంబంధించి పాటలు, సినిమాలు చూస్తుంటారు. శివయ్యకి సంబంధించి సినిమాలతో పాటు స్టార్ హీరోల పాత సినిమాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఈసారి కూడా చాలా సినిమాలు నైట్ షోస్ కి రెడీ అవుతున్నాయి.
ఈ ఏడాది మహా శివరాత్రి పండుగకు సమయం వచ్చేసింది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు రాత్రి వేళలో శివారాధనలో భాగంగా జాగారం చేస్తుంటారు. ఎవరైతే ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటారో.. వారు రాత్రంతా శివారాధనతో పాటుగా ఆ పరమశివుడికి సంబంధించి పాటలు, సినిమాలు చూస్తుంటారు. ఇదంతా ఇళ్లల్లో జరిగేది. కానీ.. ఇండస్ట్రీ విషయానికి వస్తే.. శివయ్యకి సంబంధించి సినిమాలతో పాటు స్టార్ హీరోల పాత సినిమాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటాయి. ఇది ప్రతి ఏడాది జరుగుతూ వస్తోంది. అదే విధంగా ఈసారి కూడా చాలా సినిమాలు నైట్ షోస్ కి రెడీ అవుతున్నాయి.
ఆ విధంగా చూసుకుంటే.. టాలీవుడ్ లో స్టార్ హీరోల ఈసారి బిగ్గెస్ట్ హిట్స్ తో పాటు నిరాశపరిచిన సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా సినిమాలు స్పెషల్ నైట్ షోస్ పడనున్నాయి. కానీ.. హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి.. ఇదివరకే ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమాలతో పాటు రీసెంట్ గతేడాది రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాలు సైతం రిలీజ్ అవుతున్నాయి. వీటికి సంబంధించి టికెట్స్ కూడా ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి శివరాత్రి రోజున స్పెషల్ షోస్ గా రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం!
పైన లిస్ట్ తో పాటు సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్.. ఇలా మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఆల్రెడీ స్టార్ హీరోల అభిమానులంతా ఎవరికీ నచ్చిన సినిమాల కోసం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతిసారి ఇలా స్పెషల్ షోస్ రిలీజ్ చేయడం అనేది ఇండస్ట్రీలో ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది. కాబట్టి.. మహా శివరాత్రి రోజున(ఫిబ్రవరి 18)న శివారాధనలో జాగారం చేసే భక్తులతో పాటు కామన్ ఆడియెన్స్ ఈ స్పెషల్ షోస్ ద్వారా వినోదం పొందనున్నారు. సో.. ఇవేకాకుండా ధనుష్ హీరోగా సార్, కిరణ్ అబ్బవరం హీరోగా వినరో భాగ్యము విష్ణుకథ సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. మరి శివరాత్రి రోజున ఏ సినిమా చూడాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి.
Maha Shivratri – Special Night Shows pic.twitter.com/fON6NmZnqT
— Aakashavaani (@TheAakashavaani) February 14, 2023