బిగ్‌బాస్ ఎప్పుడు మొదలవుతుందని తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుల్లితెరపై అల్లరి చేస్తూ ప్రేక్షకులకు ఎంతగానో ఆనందాన్ని అందిస్తోంది ఈ బిగ్‌బాస్. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ లీస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సారి మళ్లీ హోస్ట్‌గా నాగార్జున అనే తెలుస్తోంది. ముందుగా దగ్గుబాటి రానా అనుకున్నా చివరికి లీస్టులో మాత్రం నాగార్జున పేరు కనిపిస్తోంది. ఇక ఈ లీస్టులో ఎవరెవరున్నారో చూసేద్దాం..
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ప్రకారం షణ్ముఖ జస్వంత్, యాంకర్ రవి, ఆర్జే కాజల్, నీనియర్ నటి ప్రియ, సిరి హన్ముంతు, 7 ఆర్ట్స్ సరయు, నవ్య స్వామి, కార్తీక దీపం ఫేమ్ ఉమ, కమెడియన్ లోబో, టీవీ నటుడు మానస్, మోడల్ జస్వంత్, టీవీ నటుడు సన్నీ, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్, ప్రియాంక (ట్రాన్స్ జెండర్), న్యూస్ రీడర్ ప్రత్యూష, ఆట సందీప్/ రఘు మాస్టర్ ఉన్నారు. ఇక బిగ్‌బాస్ సభ్యులు మాత్రం దీనిపై ఇంత వరకు అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ లీస్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.