ప్రముఖ తమిళ సీరియల్ నటి దివ్య వైవాహిక జీవితం గందరగోళంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను దూరం పెడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా, దివ్య మీడియాతో మాట్లాడుతూ…‘‘ నాకు అర్నవ్‌తో 2017లో పరిచయం అయింది. ‘కేలాడి కన్‌మణి’ సీరియల్ షూటింగ్ టైంలో ఇద్దరం కలిశాం. నాకు అప్పటికే విడాకులయ్యాయి. ఓ సంవత్సరం పాప కూడా ఉంది. ఆ విషయం అతడికి తెలుసు. స్నేహంతో మా బంధం మొదలైంది. తర్వాత రొమాంటిక్ రిలేషన్‌గా మారింది. దాదాపు ఐదు సంవత్సరాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నాం.
రెండేళ్ల క్రితం వానగరంలో ప్లాట్ కొనుక్కున్నాం. ప్లాట్ కోసం నేను నా నగలు అమ్మి మరీ డబ్బులు ఇచ్చాను. కోవిడ్ టైంలో అతడికి పని లేదు. అప్పుడు నేను అంతా చూసుకున్నాను. పెళ్లి ప్రస్తావన వచ్చినపుడు అతడు నన్ను మతం మార్చుకోమన్నాడు. అతడి మాట కాదనలేక మతం మార్చుకున్నాను. జూన్ 29న మా పెళ్లి అయింది. చాలా సీక్రెట్‌గా చేసుకున్నాం. పెళ్లి తర్వాత నేను గర్భం దాల్చాను. ఇక, అప్పటినుంచి అర్నవ్ నన్ను దూరం పెడుతూ వస్తున్నాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎక్కడా పెట్టొద్దని చెప్పాడు.
ఈ నేపథ్యంలోనే అతడు వేరే నటితో రిలేషన్లో ఉన్నాడని తెలిసింది. వాళ్లు షూటింగ్‌లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లాను. ఇద్దరూ ఒకే రూములో ఉన్నారు. ఇద్దరినీ నిలదీశాను. ఆ నటి నన్ను కొట్టింది. నా ముందే నా భర్తను ముద్దు కూడా పెట్టింది’’ అని తెలిపింది. ఈ మేరకు తన భర్త మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. తనకు, తన కడుపులోని బిడ్డకు ఏదైనా జరిగితే అందుకు అర్నవ్‌నే బాధ్యతని పేర్కొంది. తన భర్త పెళ్లి తర్వాత కూడా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Shanmukh Jaswanth: కాస్ట్ లీ కారు కొన్న షణ్ముక్ జస్వంత్.. ధరెంతో తెలుసా?