సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తర్వాత సినిమాలు, టీవీల్లో కనిపించే వారికంటే.. యూట్యూబర్స్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. టిక్ టాక్, ఇన్ స్టాలోనూ రీల్స్-వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన వాళ్లు కూడా చాలామందే. ప్రస్తుతం మాత్రం యూట్యూబర్స్ లో ఎవరికి ఎక్కువ క్రేజ్ అంటే యూత్ లో చాలామంది చెప్పే నేమ్ షణ్ముక్ జస్వంత్. షార్ట్ ఫిల్మ్స్ తో మొదలైన షన్ను కెరీర్.. కవర్ సాంగ్స్ తో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య లాంటి వెబ్ సిరీసులు మనోడికి యూత్ లో తెగ క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత షన్ను ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్థికంగా బాగానే సెటిలయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న షన్ను పలు వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా దసరా సందర్భంగా ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. హైదరాబాద్ లోని ఓ షోరూంలో బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ కారుని కొన్నాడు. ఈ కారుతో షన్ను దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం తన కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. తనని ఈ స్థాయిలో చూడాలనుకున్నది కేవలం తన పేరెంట్స్, తన ఫ్యాన్స్ కోరిక అని షన్ను చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన డ్రీమ్ కారు సొంతం చేసుకున్నానని, ఈ విషయం తనకి ఇప్పటికీ కలగానే ఉందని చెప్పాడు.
ఇక షన్ను కొనుగోలు చేసిన ఈ బీఎండబ్ల్యూ కారు ధర సుమారు రూ.50 లక్షలకు పైనే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎప్పుడైనా ఎవరికైనా లిఫ్ట్ అవసరమైతే అడగండి, తప్పకుండా ఇస్తానని షన్ను.. తన ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఇదిలా ఉండగా షన్ను రీసెంట్ గా చేసిన వెబ్ సిరీస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’. తొలి సీజన్ లోని ఆరు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ఈ సిరీస్ కి సుబ్బ కథ అందించగా, అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ కాకుండా షన్ను ఏం ప్రాజెక్టులు చేస్తున్నాడనేది ఇంకా డీటైల్స్ రివీల్ చేయలేదు. ఇదంతా పక్కనబెడితే షన్ను కొత్త కాస్ట్ లీ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.