‘పుట్టిన వానికి మరణం తప్పదు.. మరణించిన వాడు జన్మించక తప్పదు..’ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో హితబోధ చేసిన విషయం అందరకి గుర్తుండే ఉంటుంది. ఆ ప్రకారం భూమ్మీద పుట్టే ప్రతి జీవికీ మరణం తప్పదు. ఏదో ఒక కారణంతో ప్రతి జీవీ మరణిస్తుంది అన్నది అందులోని అర్థం. కాకుంటే ఆ మరణం వచ్చే సందర్భమే అంతుపట్టడం లేదు. వందేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాల్సిన మానవ నిమిత్రులు అకారణంగా తమ జీవితాన్ని ముగిస్తున్నారు. వయసు మళ్ళాక మరణించడం అందరిని భాదించక పోయినా.. యుక్త వయసులో దూరమవ్వడం అందరినీ భాధించేదే. తాజగా, ఒక యువ సంగీత దర్శకుడు కామెర్ల వ్యాధి(జాండిస్) కారణంగా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. ఆ వివరాలు..
తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కామెర్ల వ్యాధితో శనివారం కన్నుమూశాడు. ఇటీవల జాండిస్ బారిన పడిన అతను చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఆ ఇన్ఫెక్షన్ అతని శరీరమంతా వేగంగా వ్యాపించడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. నెమ్మదిగా అతని ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలుపెట్టింది. అలా రోజురోజుకూ ఆరోగ్యం మరింత క్షీణించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. రఘురాం మృతి పట్ల ఆయన స్నేహితులు, సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రఘురామ్ 2017లో వచ్చిన ‘ఒరు కిదయిన్ కరుణై మను’, 2011లో ‘రివైండ్’, ‘ఆసై’ అనే మూడు తమిళ చిత్రాలకు సంగీతం అందించారు.
Tamil Music Director Raguram Pass Away pic.twitter.com/YHijwbse4M
— Sekhar Rambo (@RamboSekhar) October 29, 2022