ప్రముఖ సీరియల్ నటుడు భరత్ కల్యాణ్ భార్య మృతి చెందారు. దీంతో పలువురు నటీనటులు ఆమెకు సంతాపం చెబుతూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక విషయానికొస్తే.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణ్ కుమార్ కొడుకు భరత్ కల్యాణ్. 2007లో వచ్చిన ‘శ్రీరంగం’ అనే తమిళ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కన్నడలో సినిమాలు చేస్తూ సెటిలైపోయాడు. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సీరియల్స్ లో నటుడిగా స్థిరపడ్డాడు. ప్రస్తుతం కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న ‘జమీలా’ సీరియల్ లో కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఇక భరత్ కల్యాణ్ భార్య ప్రియదర్శిని(43) కూడా సీరియల్ ప్రేక్షకులకు కొందరికి తెలుసు. భర్తతో కలిసి పలు రియాలిటీ షోల్లో పాల్గొన్న ఈమె.. కొన్నాళ్ల క్రితం అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయారు. కొన్ని వారాల నుంచి మంచంపైనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఈమె మరణానికి డైట్ మార్పులే కారణమని మాట్లాడుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్ ని తీసుకోవడం మొదలుపెట్టారు. సడన్ గా జరిగిన ఈ ఆహార మార్పుల వల్ల ఆమె శరీరంలోని షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయట. ఇక ఓ సందర్భంలో సీరియస్ కావడంతో మూడు నెలల క్రితం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లారు. తాజాగా కన్నుమూశారు.
#breakingnews
With deep regret informing T K Priyadharshini Bharat Kalyan passed away
She leaves behind Bharath Kalyan Tarun and Nikita
Family was her life! AnMortal remains is now back home in Natesan nagar. Cremation tomorrow morning 11 am. pic.twitter.com/bGkBs3oaKT— PR Sudharshan ( Casting Director & PR ) (@Pr_sudharshan) October 31, 2022