హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఆమె బయట ఎక్కడ కనిపించి అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ అభిమానితో చాలా క్లోజ్‌గా ఇంటరాక్ట్ అయింది తమన్నా.
వెండితెర మీద కనిపించి అలరించే నటీనటులను తెరవెనుక కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తుంటారు. ఫేవరెట్ యాక్టర్ల పేర్లు, ఫోటోలను తమ శరీరం మీద టాటూ వేయించుకోవడం, కాళ్లలానే డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ మెయింటెన్ చేయడం, బర్త్‌డేలకు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం లాంటివి ఎన్నో చేస్తూ ప్రేమను చాటుకుంటుంటారు. ఇక అభిమాన నటులను కలిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేరు. వారి ఆదరాభిమానాలను చూసి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఆ అభిమానానికి భాష, ప్రాంతం సంబంధం ఉండదు. ఏకంగా గుడి కట్టేంత పిచ్చి ప్రేమను చూపించే అభిమానం మన భారతీయులకు ఉంది. తాజాగా ఓ వీరాభిమాని తన పట్ల చూపిన ప్రేమకు మిల్కీబ్యూటీ తమన్నా మంత్రముగ్ధురాలైపోయింది. ఆ ఫ్యాన్ తన ఫోటోను టాటూ వేయించుకోవడం చూసి భావోద్వేగానికి గురైంది. ఈమధ్య తమన్నా పేరు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా వినిపిస్తోంది. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడడం, ఇద్దరూ ఇంటర్వూలలో దాదాపు వారి బంధం నిజమేనన్నట్లు మాట్లాడడం చూశాం.
హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తమన్నా. ఆమె బయట ఎక్కడ కనిపించి అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ అభిమానితో చాలా క్లోజ్‌గా ఇంటరాక్ట్ అయింది తమన్నా. దీంతో ఆ ఫ్యాన్ భావోద్వేగానికి గురయ్యారు. తమన్నాను మీట్ అవగానే ఆమె పాదాలను తాకి, నమస్కరించిన ఆ వ్యక్తి బొకేతో పాటు ఓ లెటర్‌ను ఆమెకిచ్చారు. తమన్నా ఫోటోతో కూడిన టీషర్ట్ ధరించిన ఆమె తన చేతిపై ‘లవ్ యూ ది తమన్నా’ అని ఉన్న టాటూని చూపించారు. దీంతో తమన్నా ఎమోషనల్ అయ్యి, ఆ అభిమానిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పలుమార్లు ఆమెకు థ్యాంక్స్ చెబుతూ కారులోకి వెళ్లిపోయింది మిల్కీబ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. వీడియో చూస్తుంటే ఏడుపొస్తోంది. ‘అభిమానుల పట్ల తమన్నా చూపించే ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది.. అభిమానులను చాలా మర్యాదగా చూసే బంగారం లాంటి వ్యక్తి తమన్నా’ అంటూ కామెంట్లతో తనను అభినందిస్తున్నారు.
పర్సనల్‌గా విజయ్ వర్మతో రిలేషన్ కారణంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న తమన్నా ప్రొఫెషన్ విషయానికొస్తే.. ఇటీవల ‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లో రెచ్చిపోయి రచ్చ చేసింది. బోల్డ్ సీన్లలో ఆమె పర్ఫార్మెన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. చివరికి ఆ సీన్ల గురించి తమన్నా వివరణ ఇచ్చే వరకు వెళ్లింది వ్యవహారం. ఇక బాలీవుడ్ సీనియర్ నటీమణులతో ‘లస్ట్ స్టోరీస్ 2’ చేసింది. దీనిలో ఆమె ప్రియుడు విజయ్ వర్మతో రొమాన్స్ చేయడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ తర్వాత ‘భోళా శంకర్’ మూవీలో ఆడిపాడుతోంది. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే సూపర్‌స్టార్ రజినీ కాంత్ ‘జైలర్’ సినిమాలోనూ కనిపించనుంది. దిలీప్ నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.