తెలుగు టాప్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా బాలీవుడ్ బాట పడుతున్నారు. ఇక్కడ సినిమాలు తగ్గించుకొనైనా సరే.. అక్కడ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సై అంటున్నారు. సౌత్ సినిమాలు చేసే సమయంలో నియమ నిబంధనలతో నటించిన స్టార్ హీరోయిన్లు
తెలుగు టాప్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా బాలీవుడ్ బాట పడుతున్నారు. ఇక్కడ సినిమాలు తగ్గించుకొనైనా సరే.. అక్కడ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సై అంటున్నారు. సౌత్ సినిమాలు చేసే సమయంలో నియమ నిబంధనలతో నటించిన స్టార్ హీరోయిన్లు.. అక్కడకు వెళ్లాక హద్దులు చెరిపేస్తున్నారు. లిప్ లాక్స్‌కే కాదు శృంగార భరితమైన పాత్రల్లో రెచ్చిపోతున్నారు. ఆ కోవలోకే వస్తారు టాలీవుడ్ టాప్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇక్కడ అందాల విందు చేసినా.. రొమాన్స్ విషయంలో గిరిగీసుకుని నటించిన ఆమె.. బాలీవుడ్ వెళ్లాక.. ఆ గీతల్ని తనకు తానే చెరిపేసుకుని నటిస్తుంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌ల్లో తమన్నా బోల్డ్, హస్కీగా కనిపిస్తుంది.
ఇటీవలే వచ్చిన కర్దా వెబ్ సిరీస్‌తో అలరించిన తమన్నా.. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి తొలిసారి లస్ట్ స్టోరీస్ 2లో నటించింది. ఈ రోజు నుండే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైన దగ్గర నుండే.. దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు డైరెక్టర్ సుజోయ్ ఘోష్ తెరకెక్కించగా..కాజోల్, తమన్నా, నీనా గుప్తా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకూర్, అంగద్ బేడి, అమృత శుభాష్, తిలోత్తమా షోమ్, కుముద్ మిశ్రా తదితరులు నటించారు. ఈ సందర్భంగా ఇటీవల వరుస ప్రమోషన్లలో పాల్గొన్నారు దర్శకుడు సుజయ్, తమన్నా, విజయ్ వర్మలు.
ఈ సందర్భంగా ఫస్ట్ డేట్‌లో శృంగారం గురించి ప్రశ్న ఎదురైంది. తానేప్పుడూ అలా చేయలేదని తమన్నా బదులిచ్చింది. అయితే విజయ్ మాత్రం అదీ కంపల్సరీ అంటూ సమాధానం ఇచ్చాడు. తానెంత అదృష్టవంతుడ్నికాదంటూ ఆన్సరిచ్చారు దర్శకుడు సుజోయ్. మరి సెకండ్ డేట్‌లో అయినా ఎక్స్‌పీరియన్స్ చేశారా? అని విజయ్ దర్శకుడ్ని అడిగాడు. దీంతో సుజోయ్.. తాను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చానని, తన జీవితమే ఓ పోరాటమని, ఏదీ సులభంగా రాలేదంటూ గుర్తు చేసుకున్నారు. ఇక సినిమా ట్రైలర్ లో పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ అని నీనాతో పలికించిన మాటలను ప్రస్తావిస్తూ.. తాను వంద శాతం నమ్ముతానని విజయ్ అన్నారు. ఈ సందర్భంగా తాను మొట్టమొదటి సారిగా తాను లిప్ కిస్ పెట్టిన నటుడు విజయ్ అని తమన్నా అన్నారు.