Tamanna: దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గరినుంచి సెలెబ్రిటీల వరకు అందరూ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నారు. భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తున్నారు. ఇక, ఉత్తర భారత దేశంలో నవరాత్రుల సందర్బంగా గార్బా డ్యాన్స్ చేయటం ఆనవాయితీ. చిన్న, పెద్దా.. పేద, ధనికం అన్న తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా గార్బా డ్యాన్స్ చేస్తుంటారు. డ్యాన్స్ చేస్తూ సంతోషంలో మునిగిపోతుంటారు. ఇందుకు సినీ సెలెబ్రిటీలేమీ అతీతం కాదని ప్రముఖ హీరోయిన్ తమన్నా నిరూపించారు. నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఆమె అభిమానులతో కలిసి డ్యాన్స్ చేశారు.
సోమవారం ముంబైలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపానికి ఆమె వెళ్లారు. అక్కడ దేవీ పూజ అయిపోయిన తర్వాత గార్బా డ్యాన్స్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఎంతో సంతోషంగా వారితో నవ్వుతూ.. తుళ్లుతూ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తమన్నాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా, తమన్నా ‘శ్రీ’ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చారు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తెలుగులో అందరు స్టార్స్‌తోనూ సినిమాలు చేశారు. తాజాగా ‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, భోలా శంకర్, దట్ ఈజ్ మహాలక్ష్మి, బోలే చుడియాన్ సినిమాల్లో నటిస్తున్నారు. 32 ఏళ్ల ఈ అమ్మడు తాజాగా తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలంటూ నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఆ టైమ్ వస్తే గనుక ఖచ్చితంగా మా ఫ్యామిలీ వాళ్లకి చెప్పి సంతోషంగా పెళ్లి చేసుకుంటా’’ అని స్పష్టం చేశారు.
ఫ్యాన్స్‌తో తమన్నా డ్యాన్స్! pic.twitter.com/k44RrhKpvX
— venky bandaru (@venkybandaru13) October 4, 2022