Tabu: 1990 నాటి స్టార్ హీరోయిన్లలో టబు ఒకరు. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో ఆమె నటించారు. తన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక, ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 50 పడిలోకి వచ్చినా సింగిల్‌గానే జీవిస్తున్నారు. టబు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఓ హీరోతో ఎఫైర్ కారణమని ఇప్పటికీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై మీడియా ఎప్పుడు ప్రశ్నించినా ఆమె మాట దాటవేస్తూ వచ్చారు. తాజాగా, ఈ విషయంపై మొదటి సారి నోరు విప్పారు. తాను సింగిల్‌గా ఉండటానికి కారణం ఏంటని చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను యుక్త వయసులో ఉన్నపుడు అజయ్ దేవగణ్ నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకడు. నా కజిన్ సమీర్ ఆర్యా ఇంటి పక్కనే ఉండేవాడు.
అజయ్, సమీర్ ఆర్యలు నా మీద ఎల్లప్పుడూ నిఘా పెట్టేవారు. ఎవరైనా అబ్బాయిలు నాతో మాట్లాడితే వారిని బెదిరించే వారు, కొట్టేవారు కూడా. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నానంటే కారణం వారే. ముఖ్యంగా అజయ్ దేవగణ్ కారణంగానే ఒంటరిగా ఉంటున్నా. నాకు చేసిన దానికి అతడు పశ్చాత్తాపపడతాడని భావిస్తున్నాను’’ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. కాగా, టబు తన చిన్నతనంలోనే 1982లో వచ్చిన ‘బజార్’ సినిమాతో హిందీ తెరకు పరిచయం అయ్యారు.
14 ఏళ్ల వయసులో ‘హమ్ నౌజవాన్’ సినిమాలో దేవానంద్ కూతురిగా నటించారు. 1991లో వచ్చిన తెలుగు సినిమా ‘ కూలీ నెంబర్ 1’ తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. హీరోయిన్గా టబు మొదటి చిత్రం ఇది. ఆ తర్వాత తమిళం, మలయాళం, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ సినిమాల్లో నటించారు. బీబీసీ 1 ‘ ఏ సూటబుల్ బాయ్’ వెబ్ సిరీస్‌లోనూ నటించారు. మరి, తాను ఒంటరిగా ఉండటానికి అజయ్ దేవగణ్ కారణమన్న టబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan: విశ్వక్ సేన్ సినిమాను లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్