Pawan Kalyan: సీనియర్ హీరో అర్జున్ సార్జా దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అర్జున్ కూతురు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఐశ్వర్య- విశ్వక్ సేన్ సరసన హీరోయిన్గా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం ఉదయం రామనాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హీరో,హీరోయిన్లపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్, ప్రకాశ్ రాజ్‌లు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఓ చోట కూర్చుని మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ సినిమాను శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ తెరకెక్కిస్తోంది. కేజీఎఫ్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. మాటలు సాయి మాధవ్ బుర్రా, పాటలు చంద్రబోస్ అందించనున్నారు. ప్రముఖ నటులు జగపతి బాబు, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. మరి, విశ్వక్ సేన్ సినిమా లాంచ్‌కు పవన్ కల్యాణ్ హాజరవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Here's Pics Of @PawanKalyan at @VishwakSenActor new movie muhurtham & pooja ceremony !!:https://t.co/sD98AxYEQV#VishwakSen11 #PawanKalyanHD #PawanKalyan pic.twitter.com/AMmQzThgcT— PawanKalyan HD™ (@PawanKalyanHD) June 23, 2022 ' @PawanKalyan in conversation with Nanda..ji pic.twitter.com/s7DL4ahOI0— PawanKalyan Addicts™ (@PK_Addicts) June 23, 2022 ~ @PawanKalyan at @VishwakSenActor new movie muhurtham & pooja ceremony pic.twitter.com/87osYH5CHG— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) June 23, 2022