కోట్లాదిమంది మెచ్చే ఓ హీరోకు ఈమె ఫ్రెండ్. ఈమెని చూడాలంటే ఎవరైనా సరే తలెత్తుకోవాల్సిందే. మెగాస్టార్ దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరితో యాక్ట్ చేస్తోంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?
‘కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్’.. ఈ డైలాగ్ ఈమెకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎంతలా అంటే.. ఆరడగుల పొడుగున్న ఈ భామ సైడ్ క్యారెక్టర్, ఐటమ్ సాంగ్స్ తో టాలీవుడ్ లో కెరీర్ ని మొదలుపెట్టింది. కష్టపడితే అద్భుతాలు చేయొచ్చని ప్రూవ్ చేసింది. పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు 40 ఏళ్లు దాటిపోయాయి. అయినాసరే యంగ్ హీరోతో నటిస్తూ తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించేందుకు రెడీ అయిపోయింది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
అసలు విషయానికొస్తే.. ఈ పాప పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే. అసలు యాక్టింగ్ అంటే ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ భూమిక గుర్తుంది కదా? ఆమె భర్త దగ్గర యోగా నేర్చుకుంది. ఆ తర్వాత యోగా టీచర్ అయిపోయింది. ఆ తర్వాత అనుకోకుండా యాక్టర్ అయిపోయింది. అవును మీరు గెస్ చేసింది కరెక్ట్. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప అనుష్క శెట్టి. ‘సూపర్’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్ముడు.. ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చేసింది. ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది.
హీరోయిన్ అంటే ఓ తరహా పాత్రలే ఎక్కువగా చేస్తుంటారు. ఈమె మాత్రం కెరీర్ స్టార్టింగ్ లో ‘సూపర్’ లో క్యారెక్టర్ ఆర్టిస్ గా చేసింది. ‘స్టాలిన్’లో ఐటమ్ సాంగ్ చేసింది. ‘బిల్లా’లో బికినీతో వావ్ అనిపించింది. ‘అరుంధతి’లో జేజమ్మగా మాయ చేసింది. ‘బాహుబలి’లో దేవసేనగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి శెభాష్ అనిపించింది. ప్రస్తుతం తనకంటే చిన్నోడైన ‘జాతిరత్నం’ నవీన్ పోలిశెట్టితో యాక్ట్ చేస్తూ బిజీ బిజీ. సరే ఇదంతా పక్కనబెడితే చాలామంది హీరోయిన్లు అందంతో హిట్ కొడితే ఈమె మాత్రం జస్ట్ కటౌట్, యాక్టింగ్ తో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. సో అదన్నమాట విషయం. మరి ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.