Movie news : ప్రముఖ హీరోయిన్ స్వరా భాస్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఊబర్ డ్రైవర్ ఆమెకు సంబంధించిన వస్తువులను ఎత్తుకుపోయాడు. దీంతో తన వస్తువులు తనకు తెచ్చివాలంటూ సదరు కంపెనీకి కంప్లైంట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. స్వరా భాస్కర్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. నిన్న ఆమె అక్కడి యూనివర్శిటీ ఆప్ మిచిగాన్‌లో జరుగుతున్న కాన్ఫిరెన్స్‌కు హాజరుకావటానికి వెళుతోంది. ఇందుకోసం ఊబర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. క్యాబ్ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆమెకు సంబంధించిన వస్తువులు పోయాయి.
దీనిపై ఆమె ట్విటర్ వేదికగా ఊబర్ సపోర్టుకు కంప్లైంట్ చేసింది. ‘‘ హేయ్! ఊబర్ సపోర్ట్.. నేను ప్రీ ఆడెడ్ స్టాప్‌లో ఉండగా మీ క్యాబ్ డ్రైవర్ నా వస్తువులతో ఉడాయించాడు. ఇది లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. నేను వస్తువులను పోగొట్టుకోలేదు. కావాలనే అతడు తీసుకెళ్లిపోయాడు. యాప్‌లో దీని గురించి కంప్లైంట్ చేయటానికి వీల్లేకుండా ఉంది. ఎలాగైనా వాటిని నాకు తిరిగి ఇప్పించండి..ప్లీజ్!!’’ అని వేడుకుంది. దీనిపై ఊబర్ కంపెనీ స్పందించింది. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతించింది. కచ్చితంగా సహాయం చేస్తానని తెలిపింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.ఇవి కూడా చదవండి : టాలీవుడ్లో విషాదం : ప్రముఖ నటుడు మృతి