బుల్లితెరపై తన చలాకీ మాటలతో యాంకరింగ్ చేస్తూ అందరి మనసు దోచి.. తర్వాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటింది సురేఖా వాణి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సురేఖా వాణీకి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తెలుగు ఇండస్ట్రీలో నటి సురేఖా వాణి గురించి తెలియని వారు ఉండరు. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖా వాణీ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది. భద్ర, బొమ్మరిల్లు లో సురేఖా వాణికి మంచి గుర్తింపు వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్రలో అయినే ఇట్టే ఒదిగిపోయే నటి సురేఖా వాణీ. అక్క, వొదిన, తల్లి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. సురేఖా వాణీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది.. ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులను పలకరిస్తుంది. సురేఖా వాణీ మాత్రమే కాదు.. ఆమె కూతురు సుప్రితకు కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. నేడు వాలంటైన్స్ డే విషెష్ తో పాటు కుర్రాళ్లకు పాఠాలు చెబుతూ.. తన కూతురు తో ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సురేఖా వాణికి పెళ్లీడుకు వచ్చిన కూతురు ఉన్నప్పటికీ తన కూతురు సుప్రితతో కలిసి పార్టీలు, సెలబ్రెషన్స్, వెకేషన్స్ కి సంబంధించిన హాట్ డ్యాన్స్ వీడియోలు, ఫోటో షూట్స్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రాళ్ల మనసు గిలిగింతలు పెడుతుంది. సురేఖా వాణీ ని సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. ఇక తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటే విపరీతమైన క్రేజ్ సంపాదిస్తుంది ఈ అమ్మడు. తన కూతురుని హీరోయిన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తాజాగా బీచ్ లో తన కూతురు తో కలిసి వాలంటైన్స్ డే సందర్భంగా కుర్రాళ్లకు ఓ పోస్ట్ పెట్టింది..అంతేకాదు ఇందులో విషెస్ తో పాటు కాస్త జాగ్రత్తలు కూడా చెబుతుంది.
బీచ్ బ్యాగ్రౌండ్ లో సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి వాలంటైన్స్ డే సందర్భంగా తన ఇన్ స్ట్రాలో అభిమానులకు ఫోటో షేర్ చేసింది. ఇందులో ‘హ్యాపీ వాలంటైన్స్ డే గైస్, మీ జీవితాన్ని ప్రేమకోసం పాడు చేసుకోవద్దు’ అంటూ ఓ క్యాప్షన్ రాసింది. ఈ ఫోటోలో సుప్రతిత చాలా హాట్ లుక్ తో కనిపిస్తుంది. మొత్తానికి వాలంటైన్స్ డే సందర్భంగా తాము ఎంతగానో అభిమానించే సురేఖా వాణి నుంచి పోస్ట్ రావడంతో కుర్రాళ్లు తెగ సంబరపడిపోతున్నారు. ఈ సందర్భంగా రక రకాలుగా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.
‘వావ్ ఫస్ట్ టైమ్ సుప్రిత తన అందాలతో తల్లి సురేఖా వాణి అందాలను బీట్ చేసింది’ అంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. సురేఖా ఆంటీ హ్యాపీ వాలంటైన్స్ డే .. ఏంటీ ఈ రోజు మీ ప్లాన్ ’ అంటూ రిప్లై ఇస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా కుర్రాళ్లకు సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటై మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ఉండే సురేఖా వాణీ ఆ మద్య తన సహ క్యారెక్టర్ ఆర్టిస్టులతో కలిసి ఓ ఫోటో షేర్ చేసింది. తన ఇంటిలో గెట్ టుగెథర్ అయినట్లు ఫోటోలో కనిపిస్తుంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు ‘ ఏంట్రా బాబు అంటీలంతా ఒక్క చోటనే జమయ్యారు’ అంటూ కామెంట్స్ తో హల్ చల్ చేశారు.