Sushmita Sen: ప్రేమ.. ఊహలకందని ఓ అద్భుతమైన భావం. నిజమైన ప్రేమకు ఎల్లలు ఉండవు. కులం, మతం, ప్రాంతాలు అడ్డు కాదు.. వయసుతో పనిలేదు. 16 ఏళ్ల పడుచు వారి మధ్య ప్రేమ పుట్టొచ్చు.. అలాగే, 60 ఏళ్ల ముసలి వారి మధ్య కూడా ప్రేమ పుట్టొచ్చు. ప్రేమకు వయసు ఎప్పుడూ అడ్డుకాదు. ఈ విషయాన్ని గుర్తించలేని కొందరు నెటిజన్లు సెలెబ్రిటీల బంధాలపై అనవసరపు కామెంట్లు చేస్తున్నారు. వయసు తేడాతో ప్రేమలో పడ్డ వారిపై ఆన్‌లైన్ వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. అది కూడా ఆడవారిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా, సుష్మితా సేన్‌ను కొంతమంది నెటిజన్లు టార్గెట్ చేశారు. డబ్బుల కోసమే ఆమె లలిత్ మోడీతో ప్రేమాయణం సాగిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో ఆమె 10 మందితో రిలేషన్‌లో ఉన్న సంగతిని తెరపైకి తెస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ, విమర్శలు చేసే ముందు వాస్తవాస్తవాలను తెలుసుకోవటం లేదు. కామన్ సెన్స్‌ను కూడా ఉపయోగించటంలేదు. సుష్మితా సేన్‌కు డబ్బుల కోసం రిలేషన్‌ను కొనసాగించే అవసరం ఉన్నదా?.. అంటే లేదని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. సుష్మితా సేన్ సాధారణ వ్యక్తి కాదు.
మాజీ విశ్వ సుందరి, కొన్ని దశాబ్ధాల పాటు బాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరోయిన్. ఇక, నేషనల్ లెవెల్ స్టార్‌గా ఆమె చూడని విలాసాలు, డబ్బు ఉండదు. ఇప్పుడు కూడా సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఈ చిన్న విషయాన్ని ట్రోలర్స్ గ్రహించటం లేదు. ఆమె 11 మందితో రిలేషన్‌లో ఉన్నా.. గుట్టుచప్పుడు వ్యవహారాలు ఎప్పుడూ నడపలేదు. వాటిని బాహాటంగానే చెప్పుకున్నారు. ఇక, తనపై నెట్టింట జరుగుతున్న ట్రోల్స్ దాడిపై సుష్మితా స్పందించారు. ‘చుట్టూ ఉన్న ప్రపంచం ఇంత దుఃఖ పూరితంగా మారడం చూస్తుంటే గుండె పగిలిపోతోంది.
నాతో ఎప్పుడూ స్నేహం చేయని వారు, నేను ఒక్కసారి కూడా కలవని వారు… అందరూ నేడు నా మీద అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. నేను డబ్బున్న మగ వారికి వల వేస్తున్నానంటూ నా మీద తీర్పులు ఇస్తున్నారు… వీళ్లంతా చాలా పెద్ద మేధావులు’ అంటూ సుష్మితా సేన్ రాసుకొచ్చారు. సుష్మితా అన్నట్లుగా ట్రోల్స్ చేస్తున్న స్వయం ప్రకటిత మేధావులకు ఆమె గురించి ఏం తెలుసు?.. ఈ ప్రశ్న ఆమెను నిందిస్తున్న ఎవరికి వారు వేసుకుంటే వాస్తవాలు అర్థం అవుతాయి. ఆడవారిపై ట్రోల్స్ చేయటం ఓ వర్గం నెటిజన్లకు కొత్త కాదు.
గతంలోనూ సింగర్ సునీత, రామ్‌ల విషయంలో వారు ఇదే విధంగా స్పందించారు. తమ నోటి దూలకు పని చెప్పారు. సునీతను బ్లేమ్ చేస్తూ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. ఈ వయసులో ప్రేమ, పెళ్లి చేసుకోవటం ఏంటని అంటూ విమర్శించారు. నిజంగా ప్రేమ గురించి తెలిసిన వారెవరు ఇలా ప్రశ్నించే ఆస్కారం లేదు. ప్రేమ ఎప్పుడైనా.. ఏ వయసులోనైనా పుడుతుందన్నది జగమెరిగిన సత్యం. దీనిపై చర్చలు అనవసరం.
ఇక, పెళ్లి విషయానికి వస్తే.. ఓ వయసు వచ్చిన తర్వాత ఒంటరి తనం ఓ మానసిక రోగంలా మారుతుంది. ఆ రోగానికి మందు.. ‘తోడు’ అనటంలో ఎలాంటి అనుమానంలేదు. ఆ విధంగా ఒంటరిగా ఉన్న సునీత తన జీవితానికి ఓ తోడు కావాలనుకోవటంలో నూటికి నూరు శాతం తప్పేమీ లేదు. తనను అర్థం చేసుకుంటారని భావించిన రామ్‌ను.. సునీత భర్తగా ఎన్నుకోవటం విమర్శలు చేసే అంశం అస్సలు కాదు. మరి, గోల్డ్ డిగ్గర్ అంటూ సుష్మితా సేన్‌పై జరుగుతున్న దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Mani Ratnam: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం