ఇటీవల కొన్ని రోజుల నుంచి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం టాలీవుడ్ రెబర్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూయగా.. నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం మనందరకి తెలిసిందే. ఈ విషాదాలు మరవక ముందే తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్రముఖ ఫైట్ మాస్టర్ మరణించాడు. ఫైట్ చిత్రీకరణలో భాగంగా తాడు తెగటంతో ఫైట్ మాస్టర్ కిందపడి త తీవ్రగాయాలపాలైయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మార్గం మధ్యంలో ప్రాణాలు కోల్పొయాడు.
సాధారణంగా సినీ ప్రేక్షకులకు మాస్ యాక్షన్ అంటే పిచ్చి. అందుకు తగ్గట్లుగానే ఫైట్ మాస్టర్స్ సైతం తమ ప్రాణాలను పణంగా పెట్టి వాటిని కంపోజ్ చేస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. దాంతో వాళ్ల కాళ్లు, చేతులు కూడా విరగడం మనం గతంలో చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో హీరో సూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘విడుదలై’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చెన్నై శివారులోని వడలూర్ సమీపంలో చిత్రిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే భారీ యాక్షన్ సన్నివేశం కోసం రైల్ ట్రాక్ సెట్ ను వేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఫైట్ మాస్టర్ సురేష్ భారీ క్రేన్ కు బిగించి తాళ్లతో కట్టివేసి యాక్షన్ సీన్ చేస్తున్నారు. ఈ సమయంలో తాళ్లు తెగడంతో స్టంట్ మాస్టర్ కిందపడిపోయాడు. దాంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయ్యి. వెంటనే సురేష్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో.. మార్గం మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తమిళ ఇండస్ట్రీలోనే కాక యావత్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇక ‘విడుదలై’ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఫైట్ మాస్టర్ సురేష్ మృతికి సిని ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.