"హానీ రోజ్".. వీరసింహారెడ్డి రిలీజ్ తర్వాత టాలీవుడ్ లో బాగా వినబడుతున్న పేరు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యేసరికి అమ్మడికి వరుసగా అవకాశాలతో పాటు క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. ఇండస్ట్రీలో హనీ పేరు మార్మోగుతుండటంతో.. ఓ స్టార్ ప్రొడ్యూసర్ అమ్మడికి భారీ మొత్తం ఆఫర్ చేశాడట.
‘హానీ రోజ్‘.. వీరసింహారెడ్డి రిలీజ్ తర్వాత టాలీవుడ్ లో బాగా వినబడుతున్న పేరు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హనీ రోజ్ పేరు ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. బాలకృష్ణ సరసన ‘వీరసింహరెడ్డి’ సినిమాలో పెర్ఫార్మన్స్ తో పాటు డాన్స్ కూడా అదరగోట్టి.. యావత్ తెలుగు కుర్రాళ్లను తనవైపు లాక్కుంది. అయితే.. అందరూ వీరసింహారెడ్డి సినిమాతోనే హనీ రోజ్.. టాలీవుడ్ కి పరిచయమైందని అనుకున్నారు. కానీ.. గతంలోనే అమ్మడు రెండు సినిమాలు చేసింది. 2008లో ‘ఆలయం’.. 2014లో ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే.. ఈ రెండు సినిమాలు కూడా హనీకి తెలుగులో మంచి హిట్ ఇవ్వలేకపోయాయి.
ఆ తర్వాత నుండి మళయాళంలోనే వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్డమ్ సొంతం చేసుకుంది. మళ్లీ 8 ఏళ్లకు బాలయ్య సరసన వీరసింహారెడ్డి మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యేసరికి అమ్మడికి వరుసగా అవకాశాలతో పాటు క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. ఇప్పుడు హానీ రోజ్ అంటే.. తెలుగులో వీరసింహారెడ్డికి ముందు, తర్వాత అని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హనీ రోజ్ గ్లామర్ తో కోలీవుడ్ సైతం కాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుందట. ఆ వివరాల్లోకి వెళ్తే.. హానీ రోజ్ ఆల్రెడీ మలయాళం, తెలుగు భాషలతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వస్తోంది.
పైగా ఇప్పుడు క్రేజ్ తో పాటు ఇండస్ట్రీలో హనీ పేరు మార్మోగుతుండటంతో.. ఓ తమిళ స్టార్ ప్రొడ్యూసర్ అమ్మడికి భారీ మొత్తం ఆఫర్ చేశాడట. ఆ భారీ మొత్తాన్ని పొందాలంటే.. హనీకి ఓ కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. బికినీ ధరించాలని. అవును.. తాను నిర్మించబోయే సినిమాలో హనీ రోజ్ బికినీ ధరించి నటించాలని.. అలా చేస్తే మాట్లాడుకున్నంత బిగ్ అమౌంట్ ఇస్తానని చెప్పినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ప్రొడ్యూసర్ ఎవరు.. ఏ సినిమా విషయంలో హనీతో చర్చలు జరిగాయి? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. హనీ రోజ్ మాత్రం ఆ ప్రొడ్యూసర్ ఆఫర్ చేసిన మాయలో పడిందని.. ప్రెజెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి హనీ రోజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.