టాలీవుడ్ లో తనదైన టైమింగ్ డైలాగ్ లతో అందరిని నవ్విస్తుంటారు వెన్నలకిషోర్. ఆయన నటుడిగానే కాకుండా రచయితగా కూడా సుపరిచితులు. ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తన పేరును ప్రత్యేకంగా నిలుపుకుంటున్నారు. ఈయనతో పాటు రాహుల్ రవీంద్రన్ కూడా నటనతోనే కాకుండా సినిమాలను కూడా తెరకెక్కిస్తుంటాడు. ఇక వీళ్ళద్దరు వరుస అవకాశాలతో సినిమాల్లో నటిస్తు వాళ్ళ ప్రతిభను చూపిస్తున్నారు.
ఇక తాజాగా రాహుల్ రవీంద్రన్, వెన్నలకిషోర్ ఒలంపిక్స్ లో ఒక్క అవకాశం ఇవ్వండని వేడుకుంటున్నారు. సినిమాల్లో నటించే వీళ్లు ఒలంపిక్స్ వెళ్లడమేంటి అని ఆశ్ఛర్యంగా చూస్తున్నారా?..అవును తాజాగా ఓ స్టేడియంలో వీళ్లిద్దరు ఆడుతూ ఓ ఫోటోని తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు రాహుల్ రవీంద్రన్. ఇలా పోస్ట్ చేస్తూ.. ఫన్నీగా.. సార్.. మేము ఎంతో కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నాం.. చివరి నిమిషంలో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం ఏమైనా లభిస్తుందా..’’ అంటూ రాహుల్ రవీందర్ పేర్కొన్నారు. దీంతో వీరి ఫోటోలోకి ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు పలువురు సినీ స్టార్స్. ఇక నిజానికి ఒలంపిక్స్ గేమ్స్ ఈ సారి టోక్యోలో జరుగుతున్నాయి. ఎప్పుడో జరగాల్సిన ఈ గేమ్స్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు జూలై 23వ తేదీ నుంచి ఈ క్రీడా సమరం ప్రారంభం కానుంది. ఇందులో అన్ని దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు.