ఈ మధ్యకాలంలో సినిమాలో డిమాండ్ బట్టి ఏదైనా చేసేందుకు రెడీ అయిపోతున్నారు హీరోయిన్స్. ఈ విషయంలో స్టార్ హీరోయిన్స్ నుండి డెబ్యూ హీరోయిన్స్ వరకు ఎవరు మినహాయింపు కాదు. ప్రెజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. క్రేజ్ లో మాత్రం స్టార్స్ ని మించిపోయింది.
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోహీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలలో నటించేందుకు ఇబ్బందులు పడేవారని విన్నాం. కానీ.. కాలంతో పాటు ఇండస్ట్రీలో కూడా మార్పులు జరుగుతూ వచ్చాయి. అదేవిధంగా హీరోహీరోయిన్స్ కూడా అప్ డేట్ అవుతూ వచ్చారు. ఇదివరకంటే ముద్దు సీన్స్.. బెడ్ సీన్స్ చేయడానికి వెనుకాముందు ఆలోచించేవారట. ఇప్పుడవేమి లేవు. సినిమాలో డిమాండ్ బట్టి ఏదైనా చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో స్టార్ హీరోయిన్స్ నుండి డెబ్యూ హీరోయిన్స్ వరకు ఎవరు మినహాయింపు కాదు. ప్రెజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల.
తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. క్రేజ్ లో మాత్రం స్టార్స్ ని మించిపోయింది. తెలుగులో పెళ్లిసందD సినిమాతో డెబ్యూ చేసిన శ్రీలీల.. గతేడాది రెండో సినిమా ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడే సరికి వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీతో పాటు అనగనగా ఒక రాజు, జూనియర్, రామ్ – బోయపాటిల శ్రీను సినిమాలు ఉన్నాయి. ఇప్పుడీ బ్యూటీ వయసు 21 ఏళ్లు. అయినా ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు చదువు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శ్రీలీలకి సంబంధించి ఓ కిస్సింగ్ సీన్ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఆ వీడియోలో శ్రీలీల.. ఓ యంగ్ హీరోతో లిప్ లాక్ సీన్ చేయడం గమనార్హం. శ్రీలీలని కిస్సింగ్ సీన్ లో చూసేసరికి.. వెంటనే ఆ సీన్ ఎందులో ఉంది? ఆ హీరో ఎవరు? అసలు ఏ సినిమాలో వీడియో ఇది? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్, నెటిజన్స్. మరి ఆ వివరాల్లోకి వెళ్తే.. శ్రీలీల తెలుగులోకి రాకముందు కన్నడలో కిస్, భరాతే అని రెండు సినిమాలు చేసింది. వీటిలో కిస్ మూవీతో డెబ్యూ చేసిన శ్రీలీల.. తొలి సినిమాతోనే లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా.. కిస్ సినిమాలో విరాట్ కి జోడిగా శ్రీలీల నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. యాక్టింగ్, డాన్స్ తో ఇరగదీస్తున్న శ్రీలీలకు సంబంధించి ఊహించని సీన్ వైరల్ గా మారేసరికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి శ్రీలీల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#SreeLeela Kiss pic.twitter.com/0goAgXyVyr
— Hardin (@hardintessa143) February 16, 2023