ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది? అనడిగితే అందరినోటా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హవా నడుస్తోంది అనే మాటే వినిపిస్తోంది. నిజమే మరి.. ఎవరూ ఊహించనంతగా, ఊపిరి సలపనంతగా బిజీ అయిపోయింది శ్రీలీల. ‘కిస్’ అనే కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి, ‘పెళ్లిసందD’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి రవితేజ ‘ధమాకా’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది.
ఓ పాపులర్ పర్ఫ్యూమ్ యాడ్‌లో ఏం నడుస్తుంది? అనడిగితే ఆ బ్రాండ్ నడుస్తుందంటూ చేసిన ప్రమోషన్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది? అనడిగితే అందరినోటా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హవా నడుస్తోంది అనే మాటే వినిపిస్తోంది. నిజమే మరి.. ఎవరూ ఊహించనంతగా, ఊపిరి సలపనంతగా బిజీ అయిపోయింది శ్రీలీల. 2019లో ‘కిస్’ అనే కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి, ‘పెళ్లిసందD’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి రవితేజ ‘ధమాకా’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. అందమైన రూపం, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్, ఫుల్ జోష్, ఎనర్జీతో వేసే అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్‌కి అంతా ఫిదా అయ్యారు. అందానికి అభినయం కూడా తోడవడంతో ఆమె ముందు ఆఫర్స్ క్యూ కట్టాయి.
‘ఎవడ్రా జనాల్ని కొట్టి డాన్ అయ్యానని చెప్పింది? నేను కొట్టిన ప్రతోడు డానే’ అని ‘కె.జి.యఫ్’ లో రాకీ భాయ్ చెప్పినట్టు.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావు.. తెలుగమ్మాయిలను ఎదగనివ్వరు అని చెప్పిన మాటలు వేస్ట్. టాలెంట్ ఉంటే సీన్, సిచ్యువేషన్ మనకి అనుకూలంగా ఉంటాయి అని ప్రూవ్ చేస్తోంది శ్రీలీల. టాలీవుడ్లో తెలుగు కథానాయికల గురించి ఎప్పటినుండో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ‘మహానటి’ సావిత్రి తరం మొదలుకుని తర్వాత కూడా తెలుగు తెరపై సత్తాచాటి స్టార్స్‌గా చెలామణీ అయినవారు ఎందరో ఉన్నారు. కట్ చేస్తే తర్వాత పరిస్థితి మారింది. హీరోయిన్ అంటే ఇతర భాషల నుండి దిగుమతి చేసుకోవాల్సిందేననే పరిస్థితికి అలవాటు పడిపోయారు.
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. అంజలి, మాధవీలత, బిందు మాధవి, ప్రియాంక జవాల్కర్ లాంటి కొందరు తెలుగమ్మాయిలు కథానాయికలుగా వచ్చారు. కానీ శ్రీలీల రేంజ్లో సక్సెస్ కాలేకపోయారు. ‘పెళ్లిసందD’ అనుకున్నంతగా ఆడకపోయినా కానీ ఈ తెలుగమ్మాయిని ఇండస్ట్రీ జనాల కంట్లో పడేలా చేసింది. యూఎస్‌లో జన్మించిన శ్రీలీల.. కర్నాటకలోని బెంగళూరులో పెరిగింది. స్వచ్ఛమైన తెలుగు మూలాలు ఉన్న కుటుంబం ఆమెది. శ్రీలీల తెలుగు మాట్లాడుతుంటేనే అది తెలిసిపోతుంది. అలాంటి ఈ పదహారణాల తెలుగమ్మాయికి ‘ధమాకా’ చిత్రం సూపర్ బ్రేక్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాతో శ్రీలీలకు ధూం ధాం అన్నట్లు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆమెకు యాక్టింగ్, ఫిజిక్, డ్యాన్స్‌తో పాటు వాయిస్ బాగా ప్లస్ అయింది. రోజుకి 48 గంటలున్నా కానీ సరిపోదు అనేంతగా బిజీ అయిపోయింది. టాలీవుడ్లో తన మేనియా ఎలా ఉందో ఇటీవల బర్త్‌డే విషెస్ చెప్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది.
‘భగవంత్ కేసరి’లో బాలయ్య కూతురిగా చేస్తోంది శ్రీలీల. అలాగే మహేష్ బాబు ‘గుంటూరు కారం’లో సెకండ్ హీరోయిన్ కాస్తా మెయిన్ హీరోయిన్ అయిపోయింది. వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ పూర్తయిపోయింది. రామ్-బోయపాటి మూవీ, నితిన్ 32, గాలి జనార్థన్ రెడ్డి కొడుకు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘జూనియర్’ అనే కన్నడ సినిమా, విజయ్ దేవరకొండతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్-సంపత్ నందిల సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ మూవీస్‌లో ఆమెను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారు. కానీ డేట్స్ ఖాళీ లేవు అని చెప్పడానికి కూడా ఖాళీ లేనంత బిజీ అయిపోయింది శ్రీలీల. ప్రస్తుతం దర్శక నిర్మాతలకు ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. గతంలో అనుష్క, ఇలియానా తర్వాత కొంతమంది కథానాయికలకు ఇలాగే క్రేజ్ వచ్చినా, ఆఫర్స్ వచ్చినా.. శ్రీలీల రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి.