అలనాటి వెండి తెరను ఏలిన ప్రముఖ నటి సౌందర్య. కొన్ని అనుకోని కారణాల వాళ్ళ ఆమె మరణం సినీ పెరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సౌందర్య చిత్ర పరిశ్రమకు తీరని శోకాన్ని మిగిల్చిపోయింది. ఆమె మరణించి ఇప్పటికి 17 ఏళ్ళు అవుతుంది. ఇక సినిమా పరిశ్రమలో సౌందర్యకున్న పేరు ప్రత్యేకమనే చెప్పాలి. తన నటన, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి ఎన్నో పురస్కారాలు అందుకుంది.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తం 100కు పైగా చిత్రాలలో నటించింది సౌందర్య. దీంతో ఆమె నటిగా 12 సంవత్సరాలు చిత్ర పరీశ్రమలో వెలిగిపోయింది. ఈ నేథ్యంలోనే అనుకొని కారణాల వాళ్ళ ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఇక విషయం ఏంటంటే..ఎన్నో ఏళ్ల నుంచి సౌందర్య జీవిత చరిత్రను బయోపిక్ గా తెరకెక్కించాలని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక అలాంటి వార్తలే మళ్ళి ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో సౌందర్య పాత్రలో ఎవరు నటిస్తారన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి.
టాలీవుడ్ లోని కొందరి ప్రముఖ హీరోయిన్ ల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. గతంలో సావిత్రి పాత్రలో నటించి మెప్పించింది కీర్తి సురేష్. మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు అందుకుంది. ఇక త్వరలో చేయబోయే సౌందర్య బయోపిక్ లో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తితో పాటు ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ పేరు కూడా వినిపించటం విశేషం. మరి వీళ్ల ఇద్దరిలో సౌందర్య పాత్రకు ఎవరు సెట్ అవుతారో చూడాలి మరి. ఇక ప్రధానంగా సౌందర్య బయోపిక్ కు దర్శకుడు, నిర్మాతలు ఎవరన్న కీలక విషయాలు కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ గురుంచి కచ్చితమైన సమాచారం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.