కరోనా కష్ట సమయంలో దేశ పౌరులను ఆదుకున్న రియల్ హీరోలలో సోనూసూద్ కూడా ఒకరు. తన సేవా కార్యక్రమాల ద్వారానే సోనూ స్టార్ హీరోలని మించిన క్రేజ్ ని దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు సోనూసూద్ హీరోగా సినిమాలు తెరకెక్కతోన్నాయి. అయితే.., ఇలాంటి సమయంలో సోనూసూద్ చేసిన ఒక మోసం బయటకి వచ్చింది. ఇది చూసిన ప్రేక్షకులు అమ్మా.. సోనూ భాయ్ ఇంత మోసం చేశాడా? అస్సలు నమ్మలేకపోతున్నాము అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ సోనూసూద్ చేసిన ఆ మోసం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోనూసూద్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సేవా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, తన సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ తో పాటు.., తన వర్కౌట్ వీడియోస్ కూడా సోనూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అయితే.., సోనూసూద్ తాజాగా ఓ ప్రమాదకరమైన వర్కౌట్ చేశాడు. తరువాత దీన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
ఈ వర్కౌట్ వీడియోలో సోనూ తన రెండు చేతులు నేలపై పెట్టి, కాళ్లు గాల్లోకి లేపాడు. అలా కాసేపటి తర్వాత తన చేతులను కూడా తీసివేయడంతో అంతా షాక్ అయ్యారు. కింద చేతుల మీద సపోర్ట్ లేకుండా, తలక్రిందులుగా సోనూసూద్ గాల్లో ఎలా వేలాడాడో అర్ధం కాక కాసేపు నెటిజన్స్ అంతా జుట్టు పీక్కున్నారు. కానీ.., వీడియో చివరి వరకు చూస్తే ఇదంతా కెమెరా ట్రిక్ అని అర్ధం అవుతోంది.
నిజానికి తాను నేలపై ఉండే అలా వినూత్నంగా వీడియో వచ్చేలా ప్లాన్ చేశాడు సోనూసూద్. అంటే.. ఈ వీడియో అంతా మోసం అనమాట. దీంతో.., ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. సోనూసూద్ లాంటి గొప్ప వ్యక్తి కూడా ఇలా ఫన్నీగా వీడియోస్ చేస్తారా? ప్రేక్షకులను సులువుగా మోసం చేస్తారా? అంటూ.. అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి.. ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్ వేసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.