ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు రూ.37 లక్షలు తీసుకుని, హాజరు కాకపోగా, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలైనట్టు రెండు రోజుల క్రితం వార్తలు వెలుగు చూడడం తెలిసిందే. దీనిపై సోనాక్షి సిన్హా తాజాగా స్పందించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథనాలను బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఖండించారు.
“నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఈ అంశంపై నా వివరణ తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర పన్నుతున్నారు. తన నుంచి డబ్బు రాబట్టేందుకు ఇదంతా చేస్తున్నారు. అన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సొంతంగా సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ వాదులు చర్యలు తీసుకుంటారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’ అంటూ ప్రకటనలో తెలిపింది సోనాక్షి”.
Sonakshi Sinha issues official statement on non-bailable warrant against her: “This is pure fiction and the work of a rogue individual trying to harass me”#sonakshisinha #bollywoodactress pic.twitter.com/0LuLNuMP3U
— Bioscopeswala (@bioscopeswala) March 8, 2022
Sonakshi Sinh