తమిళ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోలు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో శివకార్తికేయన్ ఒకరు. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత యాంకర్‌గా, హాస్య నటుడిగా చేసి స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. శివకార్తికేయన్ శుక్రవారం ‘ప్రిన్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. కలెక్షన్ల పరంగా కూడా శభాష్ అనిపిస్తోంది. ఇక, ప్రిన్స్ సినిమాకు ‘జాతి రత్నాలు’ సినిమా డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహించారు.
ప్రిన్స్ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. సినిమా విడుదల సందర్భంగా శివకార్తికేయన్ ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్య్వూలో తన కుటుంబంపై వస్తున్న ట్రోల్స్ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పటానికి.. మనం ఏం చేసినా బాగోలేదని చెప్పటానికి చాలా తేడా ఉంది. మనం దేన్ని పట్టించుకుంటున్నాం అన్నదానిపై అంతా ఆధారపడి ఉంది. ఇప్పుడు వచ్చి.. నన్ను ఎగతాళి చేసినా.. అనవసరంగా తప్పుగా తిట్టినా పెద్దగా పట్టించుకోవటం లేదు’’ అని శివ కార్తికేయన్ అన్నాడు.
ఇందుకు యాంకర్ ‘‘ మీకో నిజం చెప్పమంటారా? మీరంటే నచ్చని వాళ్లు ఎవరూ లేరు. ఎవ్వరూ మిమ్మల్ని అసహ్యించుకోరు’’ అని అంది. ఇందుకు శివకార్తికేయన్ బదులిస్తూ.. ‘‘ నేనంటే నచ్చని వాళ్లు చాలా మంది ఉన్నారు. ట్విట్టర్ టైమ్ లైన్లోకి పోయి చూస్తే.. నా దగ్గరినుంచి మొదలుపెట్టుకుని నా ఫ్యామిలీని కూడా తిడుతున్నారు. అలాంటివి చాలా ఉన్నాయి. కానీ, మెజారిటీ ప్రజలు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అది చాలా చాలా పెద్ద విషయం. అందువల్లే నేను పరుగులు తీసి ఇంత దూరం వచ్చా. ప్రస్తుతం విమర్శలను పట్టించుకోవటం లేదు’’ అని అన్నారు.
Say No to Actor and Personal Abuses!
Everyone is watching every thing that’s happening here. It’s hard to see them like this🫤
Avoid Panniklam🤍pic.twitter.com/xphppZssBe
— Manoj Maddy (@edits_manoj) October 21, 2022