ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే చిత్రాలను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా RRR మూవీని హిందీలో రిలీజ్ చేసిన నిర్మాతలు మరో తెలుగు సినిమా రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. మరి ఆ మూవీ ఏంటి? ఎప్పుడు విడుదల చేస్తారు? అనే మరిన్ని విషయాల్లోకి వెళితే..
మహానటి తర్వాత తెలుగులో దుల్కర్ సల్మాన్ చేస్తోన్న తాజా చిత్రం సీతా రామం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కీలక పాత్ర పోషించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ హక్కులను పెన్ స్టూడియోస్ దక్కించుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హట్ టాపిక్ గా మారింది.
తాజాగా పెన్ స్టూడియోస్ నిర్మాతలు ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ క్రమంలో వారికి సీతా రామం మూవీ చాలా బాగా నచ్చింది. దీంతో హీందీలో తామే విడుదల చేస్తాం అని ముందుకు వచ్చారు. అదీ కాక శాటిలైట్ రైట్స్ తో పాటు డిజిటల్ హక్కులను సైతం పెన్ స్టూడియోస్ దక్కించుకుంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ రవితేజ నటించిన ఖిలాడి మూవీలో భాగస్వామ్యం అయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి తీసిని RRR మూవీని కూడా పెన్ స్టూడియోసే హిందిలో విడుదల చేసింది. దీంతో ‘సీతా రామం’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ హిందీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాత్రం సంస్థ ప్రకటించలేదు. దీని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#PenStudios bagged #SitaRamam Hindi rights 🤟#SitaRamamOnAug5 pic.twitter.com/DDPyH7CKyb
— Fukkard (@Fukkard) August 3, 2022