ఈ క్రింది ఫోటోలో అమాయకంగా చూస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడామె నేషనల్ బ్యూటీ. ఒకే ఒక్క సినిమాతో ఆరాధ్య దేవతగా మారిపోయింది.
ఎవరో బలవంతంగా తన చేత పనిచేయిస్తున్నారు అనేలా వెనక వైపుకి తిరిగి దూరంగా ఎవర్నో జాలిగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? కానీ ఒక్క విషయం మాత్రం పక్కా నిజ జీవితంలో ఏదో ఒక ఏరియాలో చిన్న వయసు అమ్మాయి చేత తమ బానిసలా పని చేయించుకుంటున్నారనే పిక్ అయితే మాత్రం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఒక సినిమాకి సంబంధించిన స్టిల్. ఆ స్టిల్ లో ఉన్న అమ్మాయి ఆ మూవీలో ఒక ముఖ్య పాత్రని పోషించి అందరి మనసులను గెలుచుకుంది. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఇండియన్ చిత్రపరిశ్రమను ఏలడానికి రెడీ అవుతుంది. ఏంటి ఇండియన్ చిత్రపరిశ్రమను ఏలడానికి రెడీ అవుతుందా?
ఎవరబ్బా అని అనుకుంటున్నారా. అయితే ఒక క్లూ ఇస్తాను. అప్పుడు మీరంతట మీరే తనెవరో చెప్తారు. మన దేశం పుణ్య భూమిగా చరిత్ర పటంలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి మిథిలా నగర రాకుమారి, ఆ తర్వాత అయోధ్య నగరానికి యువరాణిగా మారిన సీతమ్మ తల్లే కారణం. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే పైన ఫోటోలో ఉన్న పాప లేటెస్ట్ గా వచ్చిన ఒక సినిమాలో సీతమ్మ తల్లిలాగానే అందం, అణుకువ, పట్టుదల, ప్రేమ తదితర భావాలతో నటించి భారతదేశ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన వైపుకి తిప్పుకుంది. ఇంకా గుర్తుకు రాలేదా? సరే ఇక డైరెక్టుగా సినిమాలో ఆ అమ్మాయి పోషించిన క్యారెక్టర్ పేరు చెప్తాను. మీరే టక్కున తనా అని అంటారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంతగా మీ గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయింది కాబట్టి.
తను లేటెస్టుగా వచ్చిన ఒక సినిమాలో సీత క్యారెక్టర్ ని పోషించింది. మృణాల్ ఠాకూర్ అని వెంటనే గుర్తుపట్టారు కదూ. ఎస్ మృణాల్ ఠాకూరే. సీతారామం సినిమాలో సీత క్యారెక్టర్ లో ఒక రేంజ్ లెవెల్ లో నటించి.. ఓవర్ నైట్ భారతీయ చిత్ర పరిశ్రమని తనవైపుకి తిప్పుకునేలా చేసుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో వచ్చిన లవ్ సోనియా అనే మూవీలో.. సోనియా అనే ఒక అమాయకపు అమ్మాయి క్యారెక్టర్ లో చిన్న వయసులోనే నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. పైన ఉన్న స్టిల్ ఆ మూవీ లోదే. మృణాల్ ఠాకూర్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో నాని తో ఒక సినిమా చేస్తుంది. ఆ మూవీ ఆల్రెడీ షూటింగ్ దశలో ఉంది. ఇంకొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యింది.