చిత్ర పరిశ్రమలో నటీ, నటులు ఏపని చేసినా అది జనాల్లోకి స్పీడ్ గా వెళ్తుంది. దీంతో వారు మూవీ కార్యక్రమాల్లో భాగంగా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అయినప్పటికీ ఏదో మాట జారడం.. దాంతో అది విమర్శలకు దారి తీయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు విజయ శాంతి బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ పై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో 'లాల్ సింగ్ చడ్డా' అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో టాలీవుడ్ హీరో నాగచైతన్య సైతం ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఆగస్టు 11 న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ చుట్టూ పలు వివాదాలు చుట్టుకున్నాయి. ఆ వివాదాలు సినిమాను బాయ్ కాట్ చేయాలి అనే హ్యాష్ ట్యాగ్ పెట్టే వరకు వెళ్లాయి. ఈ క్రమంలో తాజాగా విజయ శాంతి ఆమీర్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయ శాంతి ట్వీట్టర్ ద్వారా ఈ విధంగా స్పందించారు.. ప్రజలను అమాయకులుగా భావించి నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్‌కి జనం అర్థమయ్యేలా చేస్తున్నారని అన్నారు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమిర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారని ఆమె తెలిపారు. 'భారత్‌లో అసహనం పెరిగిపోయిందని.. ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో ఆయన అన్నారని గుర్తు చేశారు రాములమ్మ. ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నరు. దురదృష్టమేంటంటే.. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే.. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నరు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ.. — VIJAYASHANTHI (@vijayashanthi_m) August 2, 2022 లాల్ సింగ్ చడ్డా బాయ్ కాట్ అంటూ వస్తోన్న వార్తలపై ఆమీర్ స్పందిస్తూ.. ''తనకు భారతదేశం అంటే నచ్చదని.. ఇష్టముండదని అనుకుంటూ ఉంటారని.. కానీ అది నిజం కాదన్నారు. అలా అనుకుంటుంటే తనకు చాలా బాధగా ఉంటుందన్నారు. లాల్ సింగ్ చడ్డా సినిమాను అందరూ థియేటర్లో చూడమని ఆమీర్ అందరిని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో విజయ శాంతి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నరు. దురదృష్టమేంటంటే.. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు.. — VIJAYASHANTHI (@vijayashanthi_m) August 2, 2022 ఆమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీషోల్లో పాల్గొంటున్నరు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి. — VIJAYASHANTHI (@vijayashanthi_m) August 2, 2022 ఇదీ చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ లో రామ్ చరణ్ గెస్ట్ రోల్! ఇదీ చదవండి: కంఠమనేని ఉమా మహేశ్వరీకి బాలకృష్ణ కన్నీటి వీడ్కోలు!