తెలంగాణ జానపదాల పాటలు, సినిమా పాటలు పడుతూ జోరుమీదుంది ప్రముఖ సింగర్ మంగ్లీ. ఇదే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ప్రతి ఏటా అన్ని రకాల పండగ పాటలను పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో మంగ్లీకి సినిమాల్లో పాడే అవకాశాలను కూడా తన్నుకొస్తున్నాయి. ఇప్పటికి సినిమాల్లో పాడిన ఆమె పాటలు సూపర్ హిట్టుగా నిలవటం విశేషం.
ఇక తాజాగా తెలంగాణలో బోనాల పండగ జాతర మొదలు కావటంతో కొత్తగా ఒక పాట విడుదలైంది. ఈ పాటను రైటర్ రామస్వామి రాయగా, రాకేష్ వెంకటాపురం సంగీతం అందించారు. ఈ పాటను మంగ్లీ తనె స్వయంగా పడింది. ఇక పాడటంతో పాటు ఢీ ఫెమ్ పండు కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు డాన్స్ కూడా చేసింది. ఇక తాజాగా విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక ఇదంతా బాగానే ఉన్నా.. ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వటంతో పాటు కొన్ని వివాదాలను కూడా మోసుకొచ్చింది.
తెలంగాణ గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మలపై ఈ పాట సాగుతుంది. ఇక ఇందులో గ్రామ దేవతలను కించపరుస్తూ, అవమానిస్తున్నారని ఓ ప్రముఖ ఆర్జే కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆమె ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తీవ్రంగా హెచ్చరించింది. తెలంగాణ సంస్కృతికి బోనాల పండగ ప్రతీక అని, పాటలతో బోనాలపై జనాలకున్న భక్తిని దెబ్బ తీస్తున్నారని మండిపడింది. మంగ్లీ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయినంత మాత్రాన ఇలా సంస్కృతిని అవమానించేలా పాట పడటం ఏంటని ప్రశ్నించింది. గతంలో గ్రామ దేవతలను పొగుడుతు పాడిన మంగ్లీ.. నేడు కించపరిచే విధంగా పాటలు పడటం ఆశ్చర్యంగా ఉందంటూ తెలిపింది. ఇప్పటికైన సమయం ఏం మించి పోలేదని, కించపరిచేలా ఉన్న ఆ లిరిక్స్ ను వెంటనే మార్చేయాలని కోరింది. ఇక దీనిపై కొంత మంది మంగ్లీకి మద్ధతు నిలవగా మరికొంత మంది వ్యతికరేకిస్తున్నారు.