ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో చిన్మయికి ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు సంపాందించిన చిన్మయికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. చిన్మయి పాడిన పాటలలో ఎన్నో పాటలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. మరోవైపు కొన్ని వివాదాల ద్వారా చిన్మయి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. చిన్మయి ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పిల్లల పేర్లు కూడా చిన్మయి రివీల్ చేసింది. 2014లో నటుడు రాహుల్ తో చిన్మయి వివాహం జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే చిన్మయి.. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇటీవల ట్విన్స్‌కు జన్మనిచ్చి చిన్మయి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అయితే తాజాగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ స్టోరీని నెటిజన్లతో పంచుకుంది. తన స్వంత యూట్యూబ్ ఛానల్‌లో ఈ మేరకు వీడియోను షేర్ చేసింది.
వీడియోలో చిన్మయి మాట్లాడుతూ..”నేను, రాహుల్ ఎప్పటినుంచో తల్లిదండ్రులు కావాలనుకున్నాం. 2020లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బయట ఏం జరుగుతుంతో తెలియదు.. ఇంతకాలం వెయిట్ చేశారు కదా ఇంకాస్త సమయం ఓపిక పట్టండని మా డాక్టర్ చెప్పింది. దీంతో కరోనా సెకండ్ వేవ్ అయిపోయాక నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ అనుకోని కారణలతో మూడు నెలలకే అబార్షన్ అయ్యింది. దీంతో చాలా బాధపడ్డాను. అబార్షన్ కారణంగా మానసికంగా చాలా కలత చెందాను. కానీ కొన్నిరోజులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్ చైనీస్ మెడికల్ డాక్టర్ ఎమిలీ నాకు పరిచయం అయ్యింది.
తన సలహాతో నా డైట్, ఎక్సర్‌సైజ్ అన్నీ పాటించాను. అవి దాదాపు మన భారతీయ ఆయుర్వేద పద్దతులే. ఇక కొంతకాలానికి నేను మళ్లీ గర్భం దాల్చాను. కవలలకు జన్మనిచ్చాను. నేను 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను’ అంటూ చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. చిన్మయి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.