సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు అప్పుడప్పుడు గాయాలు కావడం చూస్తుంటాం. సాధారణంగా ఏదైనా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించేటపుడు హీరోలకు బదులుగా డూప్ లను రంగంలోకి దింపుతారు. కానీ ఈ మద్య కొంత మంది హీరోలు స్వయంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటూ తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.
బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు దర్శకుడు, నటుడు రోహిత్ శెట్టి. తాజాగా ఈయన దర్శకత్వంలో ఇండియన్ పోలీస్ ఫోర్స్ మూవీలో యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ లో రోహిత్ శెట్టి మూవీ అంటే భారీ యాక్షన్ సీన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సిద్దార్థ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఓ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తుండగా తన చేతికి గాయాలు అయ్యాయని ఈ విషయాన్ని ఆయననే స్వయంగా తెలిపాడు.
ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా సిద్దార్థ్ విలన్ తో ఫైట్ చేస్తుంటాడు. ఇదే సమయంలో ఈ ఫైటింగ్ లో సిద్దార్థ్ రియల్ గా గాయాలయ్యాయి.. మోచేతికి రక్తాలు వస్తున్నాయి.. ఆ చేతిని చూపిస్తూ సిద్దార్థ్ కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది అంటూ నవ్వు ఫేస్ పెట్టడం ఆశ్చర్యం. తనకు గాయం అయినా కూడా లేక్కచేయకుండా యాక్షన్ సీన్లో పాల్గొన్నాడట సిద్దార్ధ్.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతునన్ ఈ సినిమాతో సిద్దార్థ్ మొట్టమొదటిసారి ఓటిటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ స్టార్ డైరెక్టర్ ఓటీటీలో ఎలాంటి విజయాల్ని అందుకుంటాడో చూడాలి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.