ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమా అంటే థియేటర్లలో మాత్రమే రిలీజయ్యేది. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కొన్ని చిత్రాలు బిగ్ స్క్రీన్ పై రిలీజై ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. మరికొన్ని మాత్రం ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. మూవీ లవర్స్ కి ఇది పెద్ద రిలీఫ్ లాంటి విషయం. అయితే స్టార్స్ నటించిన సినిమాల మాత్రం ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయడం తక్కువే. ఈ మధ్య కాలంలో అది కూడా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా బ్యూటీ రష్మిక నటించిన కొత్త సినిమా కూడా ఓటీటీ రూట్ నే ఎంచుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్నడ భామ రష్మిక, హీరోయిన్ ఫస్ట్ సొంత భాషలోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత ‘ఛలో’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇక గతేడాది ఇదే టైంకి రిలీజైన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది. అదే టైంలో బాలీవుడ్ నుంచి కూడా ఈమెకు వరస ఆఫర్స్ వచ్చాయి. అలా ఓ రెండు మూడు సినిమాలు కూడా చేసింది. కాకపోతే అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన ‘గుడ్ బై’.. కొన్నాళ్ల ముందు థియేటర్లలోకి వచ్చి, తాజాగా ఓటీటీలోనూ సందడి చేస్తోంది.
ఇక హిందీలో రష్మిక ఒప్పుకొన్న ఫస్ట్ మూవీ ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్న ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. చెప్పాలంటే ఈ మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఏమైందో ఏమో గానీ సడన్ గా నెట్ ఫ్లిక్స్ లో జనవరి 20 నుంచి నేరుగా స్ట్రీమింగ్ కానుందని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చారు. దీని గురించి రష్మిక కూడా ట్వీట్ చేసింది. మన దేశంలో జరిగిన గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ని బేస్ చేసుకుని శంతను బాగ్చి ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో రష్మిక, సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతుంది. మరి రష్మిక మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
And now it’s Mission Majnu time ❤️
Are y’all ready my loves ? 😚❤️#MissionMajnu #DeshKeLiyeMajnu #NetflixIndia pic.twitter.com/hKYRx2B2DI— Rashmika Mandanna (@iamRashmika) December 13, 2022