ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బయట దేశాల ప్రేక్షకులు.. బాలీవుడ్ మాత్రమే అనుకునేవాళ్లు. ఓ పదేళ్ల ముందు వరకు అదే కంటిన్యూ అయింది. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో.. తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత బాహుబలి 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి మన సినిమాలతో పాటు కేజీఎఫ్, కాంతార లాంటి కన్నడ సినిమాలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమా అని అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోల దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు టాలీవుడ్ లో పనిచేయాలని తహతహలాడుతున్నారు. ఇలాంటి టైంలో హిందీ స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
ఇక విషయానికొస్తే.. బాలీవుడ్ వాళ్లకు సౌత్ అంటే ఎప్పుడూ చిన్నచూపే ఉండేది. ఏదైనా సినిమా గురించి టాపిక్ వస్తే మనవాళ్లకు అస్సలు గౌరవం దక్కేది కాదు. గతంలో ఓసారి ‘వజ్రోత్సవం’ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మాత్రం సౌత్ సినిమాల్ని, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్ని బాలీవుడ్ స్టార్స్ తెగ మెచ్చుకుంటున్నారు. మన చిత్రాల్లో కనిపించాలని తాపత్రయపడుతున్నారు. దానికి కారణం బాలీవుడ్ క్రేజ్ నానాటికి పడిపోవడం, టాలీవుడ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతుండటం.. ఇలాంటి టైంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రోహిత్ శెట్టి.. ‘బాలీవుడ్ లేకపోతే దక్షిణాది సినిమా లేదు’ అని అన్నాడు. ఇక రోహిత్ శెట్టి చేసిన కామెంట్స్.. బాలీవుడ్ ఆడియెన్స్ తోపాటు దక్షిణాది ప్రేక్షకులు మండిపడుతున్నారు. కారణాలు చెప్పి మరీ ఈ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి… మసాలా మూస కామెడీ ఎంటర్ టైనర్స్ తియడంలో స్పెషలిస్ట్.
ఇక రోహిత్ శెట్టి సినిమాలు చూసుకుంటే.. దాదాపు ఒక్క సినిమా కూడా సొంతంగా తీయలేదు. అలాంటి ఈ డైరెక్టర్ దక్షిణాది సినిమాల్ని అంతమాట అనేసరికి తెలుగు ప్రేక్షకులు కూడా రెచ్చిపోతున్నారు. మరి రోహిత్ శెట్టి వ్యాఖ్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.