ఈ బ్యూటీ చాలా సినిమాలు చేసింది. ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్ పేరు చెప్పగానే అందరికీ ఈమెనే ముందుగా గుర్తొస్తుంది. అంత బాగా ఫెర్ఫార్మ్ చేసింది. ప్రత్యేకించి ఈమె నటించిన ఓ సీన్ అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ భామనే కియారా అడ్వాణీ. హీరోయిన్ గా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్.. తెలుగులోనూ ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ లాంటి మూవీస్ చేసింది. తాజాగా ‘గోవింద నామ్ మేరా’ సినిమాతో పలకరించింది. ఓటీటీలో నేరుగా రిలీజైన ఈ మూవీ… ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. అలానే మూవీతో డైరెక్టర్ తో తన బాండింగ్ గురించి కూడా బయటపెట్టింది. ఇది విని నెటిజన్స్ షాకవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2014లో రిలీజైన ‘ఫగ్లీ’ మూవీతో కియారా అడ్వాణీ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ధోనీ బయోపిక్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘భరత్ అను నేను’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో కియారా చేసిన ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్ అయితే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ లోనూ హీరోయిన్ గా చేసి హిట్ కొట్టింది. ఇక తాజాగా ‘గోవింద్ నామ్ మేరా’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. అలానే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ మూవీ టీంతో షూటింగ్ ఎంత అద్భుతంగా జరిగిందో ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది.
‘నేను డైరెక్టర్స్ నటిని. ‘గోవింద నామ్ మేరా’ సినిమా కోసం డైరెక్టర్ శశాంక్ ఖైతాన్ విజన్ కు పూర్తిగా సరెండర్ అయిపోయాను. ఓ నటిగా ఎప్పుడు కూడా దర్శకుడి విజన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సినిమా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తారు కాబట్టి వారితో సింక్రనైజ్ కావాలనేది నా అభిప్రాయం. భాషతో సంబంధం లేకుండా నా ప్రతి సినిమా రిలీజ్ ముందు తెగ టెన్షన్ పడుతుంటాను. అది థియేటర్లో రిలీజయ్యే సినిమా కావొచ్చు, ఓటీటీలో విడుదలయ్యే చిత్రం కావొచ్చు. జనాలకు నచ్చుతుందా లేదా అనే ఓ టెన్షన్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది.’ అని కియారా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ కాంబోలో తీస్తున్న కొత్త సినిమాలోనూ కియారానే హీరోయిన్ గా నటిస్తోంది. మరి కియారా వ్యాఖ్యల గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.