కెరీర్ లో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో పుంజుకుని అగ్రతారలలో స్థానం దక్కించుకుంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. ఓ రకంగా మొదటి ఇన్నింగ్స్ కంటే.. సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా మూవీస్ తో పాటు సీనియర్స్ సరసన నటించే అవకాశాలు సొంతం చేసుకుంటోంది. అలా గ్యాప్ ఇచ్చినా.. వరుస హిట్స్ తో ట్రెండింగ్ లో నిలిచింది ఈ స్టార్ హీరోయిన్.
కెరీర్ లో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో పుంజుకుని అగ్రతారలలో స్థానం దక్కించుకుంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. అలా గ్యాప్ ఇచ్చినా.. వరుస హిట్స్ తో ట్రెండింగ్ లో నిలిచింది శృతిహాసన్. ఓ రకంగా మొదటి ఇన్నింగ్స్ కంటే.. సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా మూవీస్ తో పాటు సీనియర్స్ సరసన నటించే అవకాశాలు సొంతం చేసుకుంటోంది. అదీగాక ప్రెజెంట్ శృతి.. స్టార్ హీరోలతో పాటు సీనియర్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మారింది. క్రాక్ మూవీతో కంబ్యాక్ హిట్ అందుకున్న శృతి.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ని ఖాతాలో వేసుకుంది.
ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పర్సనల్ లైఫ్ లోనూ బిజీ అవుతున్న శృతి.. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టీవ్ గా ఉంటోంది. అదీగాక ఎప్పుడూ ఫిట్నెస్ కి ప్రాధాన్యతనిచ్చే ఈ భామ.. ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ హజారికాతో ఎక్కువగా ఫోటోలు పెడుతోంది. కాగా.. ఖాళీ సమయం దొరికితే వర్కౌట్స్ పై దృష్టిపెట్టే శృతి.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. శృతి పోస్ట్ చేసిన ఫోటోలలో.. వర్కౌట్స్ చేసి చేసి.. ఆమె మోకాళ్ళు బాగా కందిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. తెల్ల చర్మంపై కందిపోయిన మరకలు చూసి.. శృతికి గాయాలయ్యాయని కంగారు పడుతున్నారు.
శృతి హాసన్ మోకాళ్ళు కందిపోయి కనిపించేసరికి.. ఫ్యాన్స్ కంగారు పడే అవసరం లేకుండా ‘గుడ్ డే ఎట్ వర్క్’ అని మెన్షన్ చేసింది అమ్మడు. దీంతో ఓకే.. వర్కౌట్స్ ఈ స్థాయిలో అవసరమా.. ఆల్రెడీ చిక్కిపోయి కనిపిస్తున్నావు అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం శృతి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే శృతి సలార్ షూట్ పూర్తి చేసుకుంది. డార్లింగ్ ప్రభాస్ సరసన మొదటిసారి శృతి కనిపించనుంది. కాగా.. తన వరకు షూటింగ్ పూర్తి చేసినట్లు చెప్పింది. ఈ సినిమాలో శృతి ఆద్య పాత్రలో నటించింది. ఇదే కాకుండా ‘ది ఐ’ అని ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా చేస్తోంది భామ. మరి శృతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Shruti Haasan pic.twitter.com/DGzqguj6UQ
— Hardin (@hardintessa143) March 2, 2023