హీరోయిన్ శ్రుతి హాసన్ తన ప్రియుడు అయిన శాంతను హజారిక గురించి సమయం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంటుంది శ్రుతి హాసన్. తాజాగా మరోసారి తన ప్రియుడి గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల లవ్ స్టోరీల గురించి మనం చాలానే వింటూంటాం. ఇక కొన్ని జంటలు అయితే ఎన్నిసార్లు కెమెరాలకు చిక్కినా గానీ.. తమ మధ్య ఏమీ లేదని చెబుతూంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి హీరోయిన్ శ్రుతి హాసన్ తన ప్రియుడు అయిన శాంతను హజారిక గురించి సమయం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంటుంది శ్రుతి హాసన్. తాజాగా మరోసారి తన ప్రియుడి గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది శ్రుతి.
శ్రుతి హాసన్.. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నది.ఇక ఈ అమ్మడు సినిమా న్యూస్ కంటే ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కలిసి వార్తల్లో నిలుస్తోంది. తన ప్రియుడిపై హాట్ కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి తన ప్రియుడిపై హాట్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.ఇక వీకెండ్ డిన్నర్ కోసం ఈ ప్రేమ జంట అక్కడ దిగిన ఫోటోలతో పాటుగా తన ఇష్టాలు, అలవాట్ల గురించి చెప్పుకొచ్చింది. తన ప్రియుడితో క్లోజ్ గా దిగిన ఫోటోను షేర్ చేసింది.
“నాకు బయటకు వెళ్లి తినడం అంటే చాలా ఇష్టం. అదీకాక నేను, శంతను ఇద్దరం తినడం కోసమే బతుకుతుంటాం. ఇక తినే సమయంలో ఇద్దరం కలిసి ఎన్నో విషయాలను చర్చించుకుంటాం. ఇక నాలాగే భోజన ప్రియుడ్ని ఎంచుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అతడు నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం” అంటూ రాసుకొచ్చింది శ్రుతి హాసన్. ఇక ప్రస్తుతం శ్రుతి హాసన్ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. దూసుకెళ్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్యలో నటించి సూపర్ హిట్ కొట్టింది. దాంతో పాటుగా బాలయ్యకు జోడీగా వీర సింహారెడ్డిలో కూడా నటించింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ లో కూడా శ్రుతి హాసన్ సందడి చేయబోతోంది.మరి శ్రుతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.