అందం విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు సీనియర్ హీరోయిన్ శ్రియ. యంగ్ హీరోయిన్లకు అసూయ పుట్టేలా రోజురోజుకీ వన్నెతగ్గని అందంతో రచ్చ చేస్తోందీ భామ. ఆమె తాజాగా దిగిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినీ పరిశ్రమలో గ్లామర్ ఎంత ముఖ్యమో తెలిసిందే. కొందరు నటులకు గ్లామర్ అదరనపు ఆకర్షణ అయితే మరికొందరికి మాత్రం అదే గొప్ప వరం. మోస్తరు టాలెంట్ ఉన్నా గ్లామర్‌తో నెట్టుకొచ్చిన వాళ్లు ఉన్నారు. ఇదిలాఉంటే.. సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఆమె మాత్రం తగ్గేదేలే అంటున్నారు. వన్నెతగ్గని అందంతో అరాచకం చేస్తున్నారు. గ్లామర్ విషయంలో యంగ్ హీరోయిన్లతో ఆమె పోటీపడుతున్నారు. ఇక, నటన గురించి తెలిసిందే. తనకు ఇచ్చిన పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తారని ఆమెకు మంచి పేరుంది. ఇప్పుడు ‘కబ్జా’ మూవీతో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నారు శ్రియ.
ఒక బిడ్డకు తల్లైన తర్వాత శ్రియా శరణ్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు తల్లైనా గ్లామర్ విషయంలో ఎలాంటి షరతులూ పెట్టుకోవడం లేదామె. ఆమె నటించిన ‘కబ్జా’ చిత్రం ఈ నెల 17న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మూవీ ప్రమోషన్స్‌లో శ్రియ చీరకట్టులో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయారు. నడుముతో పాటు ఎద అందాలను చూపిస్తూ యువత గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అలాగే హీరో ఉపేంద్ర హిట్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి అందర్నీ అలరించారు. ఆమె డ్యాన్సులు, ఫొటోలు అందరి మతి పోగొడుతున్నాయి. వయసు పెరుగుతున్నా వన్నెతగ్గని అందంతో ఉండటం శ్రియకే సాధ్యం అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. మరికొందరు నెటిజన్స్ మాత్రం ఇప్పుడు ఉన్న యంగ్ హీరోయిన్ల కంటే శ్రియనే చాలా హాట్ అంటూ మెచ్చుకుంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాను తన అందాలతో షేక్ చేసేస్తోంది శ్రియ.