కొద్దిరోజుల క్రితం జిమ్ములో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్ములోని వ్యక్తి ఆమెతో..
ఈ సమాజంలో పులిహోర రాజాలకు కొదువ లేదు. అన్ని చోట్లా దర్శనం ఇస్తూనే ఉంటారు. అవకాశం దొరికితే చాలు తమ సత్తా చాటుతుంటారు. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకుపోతారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేసే పనిలో వారిని ఇబ్బందులకు కూడా గురిచేస్తుంటారు. తాజాగా, ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌కు జిమ్ములో ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ పులిహోర రాజా ఆమెను ఇంప్రెస్ చేయటానికి చూశాడు. చివరకు నవ్వుల పాలయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆవీడియోలో… ‘‘నేను జిమ్ములో ఉన్నాను.
ఫస్ట్ వర్కవుట్ లెగ్ ప్రెస్ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నేను మిషిన్ దగ్గర ఉన్నాను. అక్కడ ఓ ట్రైనర్ ఉన్నాడు. ఆ ట్రైనర్‌ను నేనెప్పుడు అక్కడ చూడలేదు. నేను లెగ్ ప్రెస్ మూడు సెట్లు కంప్లీట్ చేశాను. అప్పడు అతడు నా దగ్గరకు వచ్చాడు. అతడ్ని పరిచయం చేసుకున్నాడు. ఏదైనా సహాయం కావాలంటే అడగండి అన్నాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. మీరు లెగ్ ప్రెస్ తప్పుగా చేస్తున్నారు అన్నాడు. చాలా రోజులనుంచి నేను జిమ్ముకు వెళ్లలేదు కాబట్టి.. అతడు చెప్పింది నిజమే అనుకున్నాను. తర్వాత నేను సుమో డెడ్‌లిఫ్ట్ చేస్తున్నాను.
ఆ వ్యక్తి నాకు కొంచెం దూరంలో నిలబడి నేను చేస్తున్నదంతా చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత నా దగ్గరకు వచ్చాడు. నేను డెడ్‌లిఫ్ట్ చేయోచ్చా అని అడిగాడు. నేను ఓకే అన్నాను. అప్పుడు అతను.. ‘మీరు డెడ్‌లిఫ్ట్ తప్పుగా చేస్తున్నారు’’ అని అన్నాడు. ఎలా చేయాలో చెప్పాడు. నేను అప్పుడు ‘ఇది డెడ్‌లిఫ్ట్ కాదు.. సుమో డెడ్ లిఫ్ట్’ అన్నాను. అప్పుడు అతడు నవ్వి అక్కడినుంచి వెళ్లిపోయాడు. నాకు బాగా నవ్వు వచ్చింది. కొంచెం గర్వంగా కూడా అనిపించింది. అతడి సుమో డెడ్ లిఫ్ట్ అంటే ఏంటో కూడా తెలీదు’’ అని పేర్కొన్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shraddha Srinath uploads a gym experience on social media. pic.twitter.com/5TrPMpEFlx
— Viral Briyani (@Mysteri13472103) June 14, 2023