ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని సంవత్సరాలు గుర్తుండిపోయామన్నది ఇంపార్టెంట్. కొంతమంది చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్‌లో బాగా రిజిస్టర్ అవుతారు. అలా రిజిస్టర్ అయిన వారిలో అపర్ణ ఒకరు. ఈమె పేరు తెలియకపోవచ్చు కానీ ఈమె చేసిన సినిమా పేరు చెబితే ఓహ్ ఈమెనా ఎందుకు తెలియదు అంటారు. ఆమె ఎవరో కాదు, సుందరకాండ సినిమాలో వెంకటేష్ సరసన సెకండ్ హీరోయిన్‌గా నటించిన అపర్ణ. ఈ మూవీలో లెక్చరర్‌ని ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం సుందరాకాండ దర్శకుడు రాఘవేంద్రరావు.. మొదట స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించి అపర్ణను తీసుకున్నారు.
సుందరకాండ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్న రాఘవేంద్రరావుకి.. నిర్మాత కెవివి సత్యనారాయణ ఇంట్లో ఒక అమ్మాయి బాగా నచ్చింది. ఆ అమ్మాయి అయితే తన సినిమాలో పాత్రకి బాగా సూటవుతుందని భావించి.. ఆ అమ్మాయినే ఫైనల్ చేయాలని భావించారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? సినిమాలు చేస్తుందో? లేదో అని రాఘవేంద్రరావు అడగలేకపోయారట. కానీ 10 రోజుల తర్వాత సుందరకాండ సినిమా ఆడిషన్స్‌లో ఆమె కూడా పాల్గొన్నారట. ఆ తర్వాత ఆమె నిర్మాత కెవివి సత్యనారాయణ మేనకోడలు అని అసిస్టెంట్ చెప్పారట. దీంతో రాఘవేంద్రరావు వెంటనే ఓకే చెప్పేశారట.
ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అద్భుతమైన నటనతో అపర్ణ ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు హీరోయిన్‌గా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయితే ఈమె దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘అక్క పెత్తనం చెల్లెలి కాపురం’ సినిమాలో నటించారు. ఆ తర్వాత 2002లో వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. సుందరకాండ మూవీలో క్యూట్‌గా ఉన్న అపర్ణ ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.