వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి. తాజాగా 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావుపై విమర్శలు సంధించారు. పృథ్వీ ఎస్‌వీబీసీ చైర్మన్ అయినప్పుడు, రాఘవేంద్రరావుగారు అవినీతి పనులుచేశాడు. దాన్ని నేను కక్కిస్తాను అని అన్నాడట.. అప్పుడు తాను ఏం చేశానంటే..
ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు తొంగి చూస్తున్న వేళ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి. గతంలో ఓ సినిమాకు తనకు నంది అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, కానీ కొన్ని పరిస్థితులు నచ్చక వాటిని తిరస్కరించానంటూ వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై విమర్శలు చేశారు. తాజాగా 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావుపై టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారు పోసాని కృష్ణ మురళి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావునుద్దేశించి కామెంట్స్ చేశారు.
రాఘవేంద్రరావుగారు పెద్ద డైరెక్టర్. ఆయనకు తానంటే చాలా ఇష్టమని అన్నారు. ‘వైసీపీ గెలిచిన తర్వాత పృథ్వీ ఎస్‌వీబీసీ చైర్మన్ అయినప్పుడు, రాఘవేంద్రరావుగారు అవినీతి పనులుచేశాడు. దాన్ని నేను కక్కిస్తాను అని అన్నాడట. నిజానికి ఆయనేమన్నాడో నేను వినలేదు. అలా అనగానే ‘ఏం మురళి నేనేదో అవినీతి చేశానంట అని పృథ్వీ అంటున్నాడు’ అంటూ పొద్దున్నే రాఘవేంద్రరావుగారు ఏడున్నర గంటలకు ఫోన్ చేశారు. నేను దానికి ‘సార్ మీరు లంచాలు తిన్నారో లేదో పొద్దునే ఎందుకు అవన్నీ, నేను చెబుతాలెండి’ అన్నాను. తాను పృథ్వీకి ఫోన్ చేసి ‘పెద్దాయన జెంటిల్‌మేన్‌లెండి. చిన్న చిన్న వాటికి ఆశపడడులే’అని అన్నాను.
తర్వాత రాఘవేంద్రరావు ఫోన్ చేసి థాంక్స్ చెప్పారు. తర్వాత పృథ్వీ పదవి దిగిపోయినప్పుడు మళ్లీ నాకు రాఘవేంద్రరావు ఫోన్ చేసి ‘హ హ హ.. మురళి’ అన్నారు. కొన్ని రోజులకు తిట్టిన పృధ్వీకి పిలిచి వేషం ఇచ్చాడు. తనకు ఇవ్వలేదన్నారు. తానింకా వైసీపీలో ఉండటమే కారణమని తెలిసింది. నాతో పని చేయించుకుంటాడు కానీ నన్నో విలన్ లా చూశారంటూ ఆయనపై విమర్శలు చేశారు. ఓ సారి నాతో మాట్లాడుతూ ‘రావణాసురుడు కోసం అతని కొడుకు మేఘనాథుడు చచ్చిపోయాడు. అలా నువ్వు కూడా ఈ రావణాసురుడు కోసం చచ్చిపోతావా.. హ హ హ’ అన్నాడు. ఈ లెక్కన జగన్ పై రాఘవేంద్రరావుకు పీకల మీద వరకు కోపం ఉందని అన్నారు. ఏ కారణం లేదు.. ఎక్కడో భూములు కొంటారు. దానికి చంద్రబాబు అయితే బాగా బెనిఫిట్ చేస్తాడు.
చంద్రబాబు రాకపోతే ఆ స్థలాలు పోతాయనే భయం ఉంటుంది. పోనీ ముఖ్యమంత్రి ఎలా పనిచేస్తున్నాడో చూడరు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాఘవేంద్రరావు డజను చొక్కాలు, ప్యాంటులు కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్ దగ్గర కుట్టించి వాళ్లింటికెళ్లి ఇచ్చి వచ్చాడు. చంద్రబాబు అంటే రాఘవేంద్రరావుకి అంత ప్రేమ. ఆ ప్రేమలో ఏం దాగుంది. ఎప్పుడైనా రామారావుగారికి అలా బట్టలు కుట్టించి ఇచ్చావా? లేదు.. ఎందుకంటే రాఘవేంద్రరావు లాభం చంద్రబాబుతో ఉంది. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. ఏం అంటాం. మహా అయితే నాకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వరు. ‘పోసానిగాడికి వేషాలు ఇవ్వొద్దు. అని తొక్కి పెట్టాలనుకుంటారు. నేను బాగా సెటిల్డ్. ఈ మాట రాఘవేంద్రరావుగారికే డైరెక్ట్‌గా చెబుతున్నాను. ఇలాంటి బ్లాక్ మెయిల్స్ చాలానే ఉన్నాయి’ని అన్నారు.