RRR మూవీ ఆస్కార్ ఖర్చుపై తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకు కారణమవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు ఫుల్ సీరియస్ అయిపోయారు. స్మూత్ వార్నింగ్ ఇస్తూ ఓ ట్వీట్ కూడా పెట్టేశారు.
అందరూ RRR గొప్పదనం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆస్కార్ వరకు వెళ్లడం చూసి తెగ మెచ్చుకుంటున్నారు. ఇదే టైంలో కొందరు మాత్రం తక్కువ చేసేలా మాట్లాడుతున్నారు. ఆయన ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ కు వెళ్లేందుకు ఏకంగా రూ.80 కోట్ల వరకు ఖర్చు చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఇవి కాస్త ఇండస్ట్రీలో పెద్ద దుమారానికి కారణమయ్యాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా ఫుల్ ఫైర్ అయిపోయారు.
ఇక వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ రవీంద్రభారతిలో తాజాగా ఓ కార్యక్రమం జరిగింది. అందులో మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజ.. సినిమా బడ్జెట్ గురించి విమర్శలు చేశారు. అలా రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. ‘రూ.200 కోట్లు పెట్టి బాహుబలి తీశారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ బడ్జెట్. ఆ తర్వాత రూ.600 కోట్లు ఖర్చు పెట్టి RRR మూవీ తీశారు. ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం రూ.80 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు నాకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొడతాను’ అని తమ్మారెడ్డి అన్నారు. కేవలం ఫ్లైట్ టికెట్స్ కే రూ.80 కోట్లు ఖర్చు చేశారని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు దీనిపైనే రీసెంట్ గా నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇప్పుడు దర్శకుడు కె.రాఘవేంద్రరావు కూడా ఓ ట్వీట్ చేశారు.
‘మిత్రుడు భరద్వాజ్ కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచవేదికలపై మొదటిసారి వస్తున్న పేరు చూసి గర్వపడాలి. అంతే కానీ రూ.80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?’ అని కె.రాఘవేంద్రరావు.. తమ్మారెడ్డిపై స్మూత్ గా కౌంటర్ వేసేశారు. ఇప్పుడు ఈ విషయంలో దాదాపు ప్రతిఒక్కరూ రాఘవేంద్రరావుకి సపోర్ట్ చేస్తూ.. తమ్మారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎవరిది రైట్ అని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
— Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023