గత కొన్ని రోజుల కిందట జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో పాల్గొన్న ఆయన జబర్దస్త్ నిర్వాహకులు, సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రొడక్షన్ సంస్థ ఆర్టిస్ట్‌లను ఎంతో నీచంగా చూస్తుందని.. తిండి కూడా సరిగా పెట్టరని కామెంట్ చేశాడు. సంస్థ తీరు సరిగా లేకనే.. చాలా మంది కమెడియన్స్ వెళ్లిపోతున్నారని ఆరోపించాడు. ఇంకా చాలా మంది బయటకు వెళ్లి పోతారు అని కూడా ఆర్పీ చెప్పుకొచ్చాడు. సదరు సంస్థ చేసే అవమానాలు భరించలేకనే సుధీర్ సైతం బయటకు వెళ్లిపోయాడని తెలిపాడు.
అయితే ఆర్పీ వ్యాఖ్యలపై స్పందించిన హైపర్ ఆది, రామ్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. అతను అబద్దాలను చెబుతున్నాడని, అతను చెప్పేవన్నీ అవస్తవాలు అంటూ ఆర్పీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఈ వివాదం గత కొన్ని రోజుల నుంచి కాస్త వైరల్ గా మారుతోంది. అయితే కమెడియన్ ఆర్పీ కామెంట్స్ పై తాజాగా స్పందించారు కమెడియన్ షేకింగ్ శేషు. అతను మాట్లాడుతూ.. పని చేసిన చోట ఇష్టం లేకుంటే ఆ సంస్థ నుంచి వెళ్లిపోవచ్చని, కానీ సంస్థను దూషించడం కరెక్ట్ కాదని అన్నారు.
ఇది కూడా చదవండి: Hyper Aadi-Auto Ram Prasad: కిరాక్ RP చెప్పినవన్ని అబద్ధాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది, రామ్ ప్రసాద్!
ఇదిలా ఉంటే ఆర్పీ వాళ్ల ఊరిలో ఒక నిర్మాతను ఒప్పించి సినిమా షూట్ మొదలు పెట్టకుండానే ఏకంగా రూ.20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడని శేషు చెప్పకొచ్చాడు. అసలు ఆ రూ.20 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు చేశాడో ఇప్పటికీ తెలియదన్నారు. ఇక ఆర్పీ పెద్ద ఫ్రాడ్డ్ అని, మరొకరి ఇళ్లును తన ఇళ్లుగా హోం టూర్ గా చూపించడాన్ని కమెడియన్ షేకింగ్ శేషు అన్నారు. ప్రస్తుతం షేకింగ్ శేషు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఆర్పీపై షేకింగ్ శేషు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.