సమీరా షరిఫ్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సీరియళ్లు, షోలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆమె తన గురించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు.
సమీరా షరిష్.. ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. 2006లో వచ్చిన ‘ఆడపిల్ల’ సీరియల్‌తో సమీర బుల్లి తెరపైకి అడుగుపెట్టారు. తర్వాత వచ్చిన అభిషేకం, భార్యామణి సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో బుల్లితెరలో టాప్‌లో వెలుగొందారు. తెలుగులోని అన్ని ఛానళ్లలో సీరియళ్లు చేశారు. తెలుగు బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతున్న సమయంలోనే తమిళంలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో తన తోటి నటుడు సయ్యద్ అన్వర్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ సంతానం ఉంది. సమీర ప్రస్తుతం సీరియళ్లతో పాటు, షోలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇక, సమీర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తరచుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. అయితే, సమీరపై కొంతమంది నెటిజన్లు తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. అది కూడా ఆడ నెటిజన్లు కావటం గమనార్హం. గతంలో చాలా సార్లు వారి కామెంట్లకు సోషల్ మీడియా వేదికగా ఆమె సమాధానం ఇచ్చారు. ఎంత జరిగినా కామెంట్లు చేసేవారు మారటం లేదు. పని గట్టుకుని మరీ ఏ కారణం లేకుండానే కామెంట్లు చేస్తున్నారు. తాజాగా, ఓ మహిళా నెటిజన్.. ‘మీకు సంబంధించిన అలాంటి వీడియో పంపండి’ అని కామెంట్ చేసింది. దీనిపై సమీర స్పందిస్తూ.. ‘‘ ‘ ఆమెకు ప్రేమ కావాలి. అదెలా ఉంటుందో చూపిద్దాం.
నీకు అలాంటి ఆలోచన ఉన్నందుకు బాధగా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరో మహిళ కూడా ఎలాంటి కారణం లేకుండానే సమీరపై కామెంట్ చేసింది. ‘ ఆమె చెప్పింది నిజమే.. నువ్వు అలాంటిది కూడా చేస్తావు’’ అని పేర్కొంది. దీని మీద కూడా సమీర స్పందించింది. ‘ ఉదయ లీలకు కూడా ప్రేమను చూపించండి. ఆడవాళ్లతో వచ్చిన చిక్కే ఇది.. ఎప్పుడూ ఇంకో ఆడదాన్ని కిందకు లాగడానికి చూస్తూ ఉంటారు’’ అని పేర్కొంది. ఉదయ లీల కామెంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమీర పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. సదరు తప్పుడు కామెంట్లు చేస్తున్న మహిళలపై మండిపడుతున్నారు. మరి, తోటి ఆడవాళ్లు సమీరపై కామెంట్లు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.