Serial Actor Sathish Kumar: బుల్లితెరపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఎవరిగురించైనా చెప్పుకోవాల్సి వస్తే.. ఠక్కున గుర్తుచ్చే పేరు ‘సతీష్ కుమార్’. దూరదర్శన్‌తో మొదలైన ఈయన ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ 30 ఏళ్లలో తెలుగు, తమిళంలో కలిపి 140 సీరియళ్లు చేశారయన. వీటిలో ఎక్కువ భాగం హీరోగా చేశారాయన. గతంలో ఎక్కువగా డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం తమిళ సీరియల్ ఇండస్ట్రీకే పరిమితమైపోయారు. తమిళంలో టాప్ సీరియల్ నటుడిగా ఉన్న సమయంలోనే నటి సీతను ప్రేమ వివాహం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. నటుడు, దర్శకుడు అయిన పార్తీబన్‌తో విడాకుల తర్వాత 2010లో సతీష్, సీత పెళ్లి చేసుకున్నారని, కొన్ని కారణాల వల్ల 2016లో వీరిద్దరూ విడిపోయారన్న పుకార్లు షికార్లు చేశాయి.
సీతతో పెళ్లి, విడాకులు అంటూ వస్తున్న వార్తలపై సతీష్ స్పందించారు. తాజాగా, సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ అసలు మేము పెళ్లి చేసుకోలేదు. పెళ్లి ప్రస్తావనే లేదు. మేము మంచి స్నేహితులుగా కలిసున్నాం. వాళ్లింట్లో సమస్యలు ఉన్న సమయంలో.. మేము కలిసి ఉండటం వల్ల మాపై పుకార్లు వచ్చాయి. ఆ న్యూస్ తీవ్ర స్థాయికి వెళ్లిపోయింది. కాంట్రవర్సీల కోసం కొంతమంది న్యూస్ రాశారు. మేము ఇప్పటికీ ఫ్రెండ్స్‌లానే ఉన్నాం’’ అని చెప్పుకొచ్చారు. మరి, సతీష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Aryan Khan: డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన NCB