అప్పటి తరం హీరోలు ప్రజలతో మాట్లాడాలంటే పత్రికల్లో రాసిన లేఖల ద్వారానే మాట్లాడేవారు. ఆ పత్రికల్లో తమ అభిమాన హీరోలు రాసిన మాటలను చదువుకుని మురిసిపోయేవారు. మరి ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ స్వహస్తాలతో రాసిన కృతజ్ఞత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆ చేతిరాత ఎలా ఉందో చూసేయండి.
అప్పట్లో సోషల్ మీడియా అంటే దినపత్రికలే. దినపత్రికల ద్వారా ప్రజలతో మాట్లాడేవారు. ఇంటర్వ్యూలు కూడా అక్షర రూపంలోనే ఉండేవి. తమను స్టార్లను చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలంటే లేఖలు రాసేవారు. తన కెరీర్ తొలినాళ్లలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నా మొదటి సినిమా చేస్తున్నా, ఆశీర్వదించండి అంటూ వినూత్నంగా స్వహస్తాలతో రాసిన లేఖ అప్పట్లో సంచలనం సృష్టించగా.. ఈ జనరేషన్ లో కూడా వైరల్ గా మారింది. కృష్ణ చేతి రాత ఇలా ఉంటుందా అని ఈ తరం వారికి తెలిసింది. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వహస్తాలతో రాసిన లేఖ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఆ లేఖలో ఏముందంటే?
ముత్యాల్లాంటి అక్షరాలూ, ఎక్కడా కూడా అక్షర దోషాలు లేవు. ఆ అక్షరాలను చదువుతుంటే ఎన్టీఆర్ పక్కనే నిలబడి మాట్లాడినట్టు ఉంటుంది. అంత పొందిగ్గా, అంత అద్భుతంగా రాశారు. ఎన్టీఆర్ చేతి రాత ఇంత బాగా ఉంటుందా అని అనిపించక మానదు. విజయచిత్ర అనే పత్రిక ద్వారా పాఠకులకు మూడు పేజీల లేఖ రాశారు. షూటింగ్ మధ్యలో విరామం దొరికితే రాసిన లేఖ అది. ఎన్టీఆర్ అచ్చ తెలుగులో ఆ లేఖను రాసుకొచ్చారు. చాలా కాలం తర్వాత విజయచిత్ర పత్రిక ద్వారా కృతజ్ఞత తెలిపే అవకాశం లభించిందని, చాలా సంతోషం అని రాసుకొచ్చారు. నటునిగా ఈరోజు అహర్నిశలూ కృషి చేయగలిగినా, వివిధ పాత్ర నిర్వహణకు సాహసించగలిగినా మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం అనే నా విశ్వాసం అని రాసుకొచ్చారు.
తనను ఇంతటి వాడ్ని చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు, నిర్మాతలకు, తోటి కళాకారులకు, ఇండస్ట్రీకి చెందిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఈ లేఖ రాశారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఆయన రాసిన లేఖ నెటిజన్ల మనసు దోచుకుంటుంది. ఆఖరున మీ రామారావు అని ఆయన పెట్టిన సంతకం ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ రాసిన ఈ లేఖ విజయచిత్ర వారు 1966లో ప్రచురించారు. అప్పట్లో హీరోల సోషల్ మీడియా ఇదే. దిన పత్రికల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించేవారు. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలన్నా ఇదే మార్గాన్ని అనుసరించేవారు. అలా ఎన్టీఆర్ రాసిన ఈ లేఖ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ చేతి రాతను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మరి ఎన్టీఆర్ చేతిరాతపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.