హీరోయిన్లు, సెలబ్రిటీలు వీళ్లను అందరూ ఊరికే గుర్తుపడుతూ ఉంటారు. కొందరినైతే సోషల్ మీడియాలో ఫాలో అవుతూ వారు చేసే పోస్టులకు లైకులు, షేర్లు చేస్తుంటారు. వారి ఫేవరెట్ హీరోయిన్లు ఇప్పుడు అంటే క్యూట్‌గా, అందంగా ఉంటారని తెలుసు. కానీ, వాళ్లు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? ఎంత క్యూట్‌గా ఉండేవారు అనే విషయాలు చాలా మందికి తెలియలు.
కానీ, గొత కొన్నాళ్లుగా సెలబ్రిటీలే వారి చిన్నప్పటి ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. కొంతమందిని అంటేచూడగానే గుర్తుపట్టచ్చు.. కానీ, కొందరిని మాత్రం అంత ఈజీగా గుర్తించడం కష్టం. అలాగే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా వెలిగిన మీరాజాస్మిన్ తన చిన్నప్పటి ఫొటోని షేర్ చేసింది. అయితే అప్పటి మీరాజాస్మిన్, ఇప్పటి మీరా జాస్మిన్‌ని గుర్తించడం అంత కష్టం కాదులెండి.
గత కొద్ది రోజులుగా మీరాజాస్మిన్ సోషల్ మీడియాలో యాక్టవ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సినిమాల్లో నటించే సమయంలో హోమ్లీ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు పూర్తి భిన్నంగా ఫొటో షూట్లు నిర్వహిస్తోంది. తాను హోమ్లీ హీరోయన్‌గానే కాదు.. హాట్ పాత్రలకు కూడా సెట్ అవుతానని చెప్పకనే తన ఫొటోలతో చెబుతోంది.
జనవరి 19న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించిన మీరా జాస్మిన్.. అందమైన ఫొటోలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుస ఫొటో షూట్లు, జిమ్ ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. మళ్లీ తిరిగి ఇండస్ట్రీపై పూర్తిగా దృష్టి సారించాలని ఫిక్స్ అయ్యాకే ఇలా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోందంటూ కామెంట్లు వస్తున్నాయి.
2014లో వివాహం తర్వాత మీరా జాస్మిన్ కెరీర్‌కు దూరంగా గడిపింది. తర్వాత అడపాదడపా సినిమాలు తీసినా అవి వేళ్లపై లెక్కించేవే. 2018 తర్వాత అయితే పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా గడిపింది. 2022లో మకల్ అనే మలయాళం సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్ని సినిమా అవకాశాలు ఉన్నాయి? ఏఏ ప్రాజెక్టుల్లో కనిపించనుందనే వాటిపై అయితే క్లారిటీ లేదు. మీరాజాస్మిన్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.