హీరోలు అవుదామని వచ్చి జీరోలుగా మారి కొంత మంది కుర్రాళ్లు తిరిగి ఇంటి ముఖం పడుతుంటే.. ఏదైనా సాధించే తీరాలన్న కసితో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ.. చిన్న చితక సినిమాలు చేస్తున్నారు మరికొంత మంది. గాడ్ ఫాదర్స్ లేకపోయినా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు
సినిమాల మీద ఫ్యాషన్‌తో ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం కాదనుకుని పరిశ్రమలోకి వస్తున్నారు యువకులు. హీరోలు అవుదామని వచ్చి జీరోలుగా మారి కొంత మంది కుర్రాళ్లు తిరిగి ఇంటి ముఖం పడుతుంటే.. ఏదైనా సాధించే తీరాలన్న కసితో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ.. చిన్న చితక సినిమాలు చేస్తున్నారు మరికొంత మంది. గాడ్ ఫాదర్స్ లేకపోయినా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఒకే ఒక్క అవకాశంతో తమను తాము నిరూపించుకుని స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు కుర్రహీరోలు. అటువంటి హీరోలకు టాలీవుడ్‌లో కొదవ లేదు. అయితే ఇక్కడే చిక్కు వచ్చి పడింది. స్టార్ హీరోగా ఎదిగాక.. తొందర పాటు నిర్ణయాలు, స్రిప్టు ఎంపికలో తప్పిదాల కారణంగా.. వారిని వారే తొక్కేసుకుంటున్నారు.
ఆ జాబితాలో ఈ హీరో కూడా ఉన్నారు. రావడంతోనే చతికిల పడ్డా.. రెండవ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు. మంచి కటౌట్ కూడా. హీరోగానే కాకుండా విలనిజాన్ని ప్రదర్శించగలను అని నిరూపించాడు. ఇంతలో పలు సినిమాలు చేసినా ఫెయిల్యూర్స్ పలకరించాయి. తెలుగులోనే కాదూ తమిళనాడులో మరిన్ని అవకాశాలు వస్తాయన్న హోప్స్‌తో కోలీవుడ్‌లో కూడా నటించాడు. అక్కడ అతడికి అచ్చొచ్చినట్లు లేదు. దీంతో కొంత డిప్రెషన్‌లో కూరుకుపోయాడని కొన్ని వార్తలు పుట్టుకువస్తున్నాయి. మంచి మంచి కథలు వస్తున్నా, తీసేందుకు నిర్మాతలు ఉన్నా డైలమాలో పడిపోయాడు ఈ ఎనర్జిటిక్ హీరో. అలా అని తెలుగులో తన ప్రయత్నాలు మానలేదు.
దెబ్బ మీద దెబ్బలాగా.. మేనేజర్, సలహా దారుల మాటలు వినడం వల్ల ఏదీ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు యంగ్ అండ్ డైనమిక్ హీరో. ఏ కథ వచ్చినా లోపాలు వెతుకుతూ.. కథలో జోక్యం చేసుకుంటూ ఆ హీరోని మరింత కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. అలాగే పీఆర్ విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ టాక్. ఎవరినీ నమ్మాలో, ఏ కథ చూజ్ చేసుకోవాలో తెలియక మీమాంసలో పడిపోయాడట ఈ యంగ్ హీరో కమ్ విలన్. తన కొత్త సినిమా విడదులకు సిద్ధంగానే ఉన్నా, సినిమాపై అంచనాలు ఉన్నా.. అతడు మాత్రం తదుపరి సినిమాల ఎంపికలో మాత్రం స్టెప్ తీసుకోలేకపోతున్నాడని వినికిడి. ఇంతకు ఆ హీరో ఎవరన్నదీ ప్రస్తుతానికైతే సస్పెన్స్.