అదితిరావు హైదరీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కార్తీ సరసన నటించిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సుధీర్ బాబుతో సమ్మోహనం సినిమాలో నటించి.. నిజంగానే తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత తెలుగులో అంతరిక్షం, వీ, మహాసముద్రం సినిమాలలో నటించింది. ప్రస్తుతం సినిమాతలో కన్నా కూడా డేటింగ్ రూమర్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది అదితిరావు హైదరీ. ప్రస్తుతం ఈ భామ.. నటుడు సిద్ధార్థ్‌తో రిలేషన్‌లో ఉంది. తాజాగా శర్వానంద్ నిశ్చితార్ధానికి వీరిద్దరూ జంటగా హజరయ్యారు.
ఇక అదితిరావు హైదరీకి గతంలోనే వివాహం అయ్యింది. సత్యదీప్ మిశ్రా అనే నటుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2009లో వీరి వివాహం జరగ్గా.. 2013లో వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో తాజాగా అదితిరావు హైదరీ మాజీ భర్త.. సత్యదీప్ మిశ్రా రెండో వివాహం చేసుకున్నాడు. నీనా గుప్తా-వివియన్ రిచర్డ్స్ కుమార్తె మసాబా గుప్తాను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండో వివాహం చేసుకోవడంపై స్పందించాడు సత్యదీప్ మిశ్రా.
ఈ సందర్భంగా సత్యదీప్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘మా పెళ్లి చాలా సింపుల్‌గా జరగాలని భావించాం. అందుకే జనవరి 27 ఉదయం వెళ్లి రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం.. తర్వాత చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. మా బంధం గురించి దాచుకోవాలని మేం ఎప్పుడు అనుకోలేదు. రహస్యాలు అనేవి బంధాన్ని బాగా ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్‌గా ఉండాలి’’ అన్నాడు.
ఈ సందర్భంగా మాజీ భార్య అదితిరావు హైదరీ గురించి సంచలన ఆరోపణలు చేశాడు సత్యదీప్ మిశ్రా. ‘‘అదితితో నా రిలేషన్ కారణంగా.. నాకు ప్రేమ మీదనే విరక్తి కలిగింది. మరోసారి ప్రేమలో పడటం అంటేనే భయం కలిగింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు.. మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’’ అని చెప్పుకొచ్చాడు. ఇక మసాబా గుప్తాకు కూడా ఇది రెండో వివాహమే. మరి సత్యదీప్ మిశ్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.