సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో మహేష్ కు జోడిగా నటిస్తున్నారు హీరోయిన్ కీర్తి సురేష్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఓ సీన్ లీక్ అయ్యింది. లీక్ అయినా ఈ సీన్ ఇప్పుడు ఈ నెట్టింట్లో హల్చల్ గా మారింది.
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను శర వేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలు చేస్తునే వరుసగా మరికొన్ని చిత్రాలకు సైన్ చేస్తున్నాడు ఈ సూపర్ స్టార్. తన నటనతో టాలీవుడ్ లో అగ్ర భాగాన ఉన్నాడు మహేష్ బాబు. గతంలో విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు. దీంతో పాటు సర్కారు వారి పాట మూవీ అనంతరం మరికొన్ని సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక తాజాగా మూవీ సీన్ లీక్ అవ్వడంతో మహేష్ అభిమానులు మండిపడుతున్నారు.